Tollywood news in telugu
కీర్తీసురేష్ తీసుకున్న నిర్ణయం పై అభిమానుల ఆగ్రహం !

keerthi suresh మహానటి సావిత్రి కి దీటుగా నటించిన కీర్తిసురేష్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇలా మంచిపేరు సంపాదించుకున్న ఈ నటి పై తన అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే చిరంజీవి హీరోగా చేస్తున్న ‘వేదాళం ‘ రీమేక్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించడానికి ఒప్పుకోవడంతో ప్రజలు, తన అభిమానులు ఆగ్రహానికి గురి అవుతున్నారు.
ఇలా చెల్లిగా చేస్తే కీర్తి సినిమాలలో హీరోయిన్ పాత్రలకు దూరం కావాల్సి వస్తుందని కీర్తీ అభిమానులు భయపడుతున్నారు. హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని షోషల్ మీడియా వేదికగా కీర్తీ కి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికి అభిమానులు వారి అభిమాన హీరో,హీరోయిన్ల మంచికోరి చెప్తూ ఉంటారు. ఈ విషయం పై కీర్తీ సురేష్ ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి.