telugu gods devotional information in telugu
కేతుకాల దీపము గురించి మీకు తెలుసా
కేతు పాలిత కాలం అంటే తెలుసా ? ?
మనకు ఒక రోజులో ఉండే 24గంటల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో పాలిత కాలం ఉంటుందీ. అలాగే ఆ కాలంలో చేసే పనులకు కూడా ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈరోజు మంగళ వారం. కుజుని ప్రభావమ్ అధికంగా ఉండే కాలం.కుజుడు ఇచ్చే ఫలితాలను కేతువు ఇస్తాడు.
ఒక రోజు లో కేతువు పాలించే కాలాన్ని కేతుకాలం అంటారు. దీన్ని మన ప్రాంతంలో యమగండం అని అంటారు ఇది క్యాలెండర్ లో ఉంటుంది తమిళ్ నాడు లో ఈ కాలాన్ని బాగా ఆచరిస్తారు. రాహుకాలంలో వలె ఈ సమయంలో గణపతి కి దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.మట్టి ప్రమిదల్లో కొబ్బరి నూనెతో చేయాలి. జాతకంలో ఉన్న అపమృత్యువు దోషాలు తొలగి పోతాయ్. వీలయితే గనక తప్పకుండా చేయవచ్చు. కేతుకాల దీపం మన ఇంట్లో కూడా వెలిగించ వచ్చు.