health tips in telugu
Heart Diseases: గుండె సమస్యలు రాకుండా ఉండటానికి ఈ చిన్న చిట్కాలు మీ కోసం ..!

Heart Diseases: ఇప్పుడు ప్రజల జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. తన ఉద్యోగం కి ఎలాంటి ఆటంకం కలగకుండా ఎక్కువ సమయం తన ఉద్యోగ బాధ్యతలకై సమయాన్ని కేటాయిస్తూ తన ఆరోగ్య విషయాన్నీ మరచిపోతున్నారు . ప్రజలు ఎక్కువగా బయటి ఫుడ్ కి అలవాటుపడి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అదేవిదంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఫలితంగా గుండెపోటు కు గురి అవుతున్నారు.
గుండె జబ్బులు రాకుండా ఉండటానికి ఇవి చేయండి:

- ప్రతిరోజు ఉదయాన్నేలేచి 45ని,, వ్యాయామం చేయండి. ఇలా చేయడంవల్ల ఆ రోజు ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
- ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా దొరికే పదార్థాలు,కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నట్స్ ఉండేలా చూసుకోండి.
- మీరు తీసుకొనే ఆహారం సులువుగా అరిగే విదంగా ఉండాలి అదేవిదంగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకొంటూ ఉండాలి.
- ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు ప్రతి గంటకి ఓసారి లేచి ఓ రెండు నిమిషాల పాటు నడవండి.
- మీ బరువును పెంచే ఆహారపదార్థాల జోలికి పోకపోవడం మంచిది.
- రోజూ తినే ఆహారంలో మీకు సరిపడినన్ని మాత్రమే క్యాలరీలు ఉండేలా చుడండి.
- మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండండి.
- ప్రతి మూడు నెలలకొకసారి వైద్యుడిని సంప్రదించి Heart Diseases మీ గుండె పనితీరును తెలుసుకోండి. ఈ నియమాలని పాటిస్తూ మీ గుప్పెడుగుండెను పదిలంగా కాపాడుకోండి.