Know about telugu Bigboss4 Contestent divi vadthya

Divi vadthya తెలుగులోనే కాకుండా అంతటా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో Bigboss , Bigboss season -4 లోకి మోడల్ & హీరోయిన్ దివి వద్యా ప్రవేశించారు. దివి వద్యా 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు పొందారు.
MBA పూర్తి చేసిన ఈ అమ్మాయి మన హైదరాబాదీ. యాక్టింగ్ అంటే ఆమెకు పిచ్చి అనే విషయం తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అయితే ఈ అమ్మడు మహర్షి చిత్రంలో ఓ పాటలో అందాల ఆరబోతతో తెరపైన గుర్తింపు పొందారు. మంచి జోష్ ఉన్న పాటతో బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి నాగార్జున తో ముచ్చటపెట్టారు.

దివి వద్యా తన గురించి చెబుతూ.. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్‌టైన్ ఇండస్ట్రీలోకి వచ్చాను అలాగే సినిమా అంటే నాకు చాలాఇష్టం, నా ఫ్యామిలీ కూడా నా ఇష్టా ఇష్టాలను గౌరవిస్తారు . సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు పాకెట్ మనీ కోసం మోడలింగ్ కుడా చేశాను.

ఇక్కడ అందరు పేరు తెచ్చుకొన్న తర్వాత బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కానీ బిగ్‌బాస్ ద్వారా నేను పేరు తెచ్చుకొంటాను అని దివి అన్నారు. దివి తల్లి, సోదరుడు డాక్టర్లుగా సేవలందిస్తున్నారు.