movie reviews

ksheera sagara madhanam – క్షీర సాగర మధనం 2021

ksheera sagara madhanam :- క్షీర సాగర మధనం (2021)

నటీనటులు :- మానస్ నాగులపల్లి, సంజయ్‌రావు, గౌతమ్‌సెట్టి, అక్షత సోనవనే

నిర్మాతలు:- : శ్రీ వెంకటేశ్ పిక్చర్ & ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్

డైరెక్టర్ :- అనిల్ పంగులూరి

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో మానస్ నటించిన క్షీర సాగర మధనం ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే క్షీర సాగర మధనం వచ్చింది. ఇపుడే సినిమా ఎలా ఉందొ చూద్దాం.

ksheera sagara madhanam Story :-

ఈ కథ ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుని చూపిస్తూ మొదలవుతుంది. వారే గోవింద్ (గౌతమ్ శెట్టి), ఓంకార్ (సంజయ్ రావు), ప్రియంత్ (యోగేష్) ,భరత్ (మహేష్ కమ్ముల), ఇషిత (అక్షత సోనవాణి )మరియు విరిత (చరిష్మా శ్రీకర్). వీరందరూ ఒకే కంపెనీ లో పనిచేస్తారు. ఇదిలా ఉండగా ఈ కంపెనీ లో క్యాబ్ డ్రైవర్ గా రిషి (మానస్) పనిచేస్తుంటాడు. వీరందరిలో రిషి మరియు ఇషిత మధ్య కొంచెం స్నేహ భావం ఉండటం వాళ్ల ఎపుడు మాట్లాడుకుంటారు. అయితే ఒకానొక సందర్భం లో ఓంకార్ చేసిన పని వల్ల వీరందరూ ఇబందిలో పడుతారు. ఆ ఇబంది నుంచి ఎలా బయట పడ్డారు? రిషి ఎం చేయగలిగాడు? అసలు ఆ సమస్య ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. .

👍🏻:-

  • మానస్ మరియు మిగితా ఆరుగురి నటన.
  • కథ బాగుంది.
  • పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ బాగుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎🏻:-

  • కథనం సరిగా రాసుకోలేదు.
  • ఫస్ట్ హాఫ్ బోర్

ముగింపు :-

మొత్తానికి క్షీర సాగర మధనం అనే సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ కోటించిన సెకండ్ హాఫ్ లో సన్నివేశాలతో క్లైమాక్స్ వరకు సీట్లో కూర్చోబెడుతుంది. మానస్ సినిమాలో బాగా నటించాడు. మానస్ తో పాటు నటించిన ఆరుగురు సినిమాకి ప్రాణం పోశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సెకండ్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధ మొదటి భాగం లో కూడా పెటింటే సినిమా బాగుండేది. మొత్తానికి ఈ సినిమా ఈ వారంలో ఓసారి చూసేయచ్చు.

ksheera sagara madhanam Rating :- 2.25/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button