Today Telugu News Updates
KTR: తెలంగాణకు కొత్త సీఎం కేటీఆర్?

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్…తన మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను బుధవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు కేటీఆర్ ను తను తరచు కలుస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో కేటీఆర్ సీఎం కాబోతున్నాడని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు దీంతో మళ్లీ కేటీఆర్ సీఎం అవుతాడు అనే అంశం తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎలక్షన్ లో విజయం సాధించిన నుంచి కెసిఆర్ కెటిఆర్ ను సీఎం చేస్తాడని టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు భావించారు కానీ చివరికి కేటీఆర్ కి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడంతో.. ఆ వార్త అక్కడితో ముగిసింది మళ్లీ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ కేటీఆర్ సీఎం అవుతాడు అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది
