best web series reviews

kudi yedamaithe web series – కుడి ఎడమైతే (2021)

kudi yedamaithe web series : సినిమా :- కుడి ఎడమైతే (2021)

నటీనటులు :- అమలాపాల్, ఈశ్వర్ రచిరాజు, రాహుల్ విజయ్

నిర్మాతలు:- : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కుచిబోట్ల

డైరెక్టర్ :- పవన్ కుమార్

kudi yedamaithe web series: లాక్డౌన్ సమయం లో ప్రజలకి ఓ టీ టీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.

kudi yedamaithe web series Story

ఈ కథ ఫిబ్రవరి 29 నా జరిగే సన్నివేశాలతో కూడుకొని, దానిలోని మలుపులని అనుసరిస్తూ రాసుకున్నది. ఇక కథ విషయానికి వస్తే హీరో ఆది( రాహుల్ విజయ్ ) నటుడిగా ఉన్నత స్థాయిలో చేరుకోవాలని కలలు కనే మనిషి, కానీ వాస్తవానికి అతను డెలివరీ బాయ్ గా పని చేస్తుంటాడు. అయితే ఆది కి తరచూ కలలు వస్తుంటాయి , అందులో జరిగే సంఘటనలే తన నిజ జీవితం లో జరుగుతుంటాయి , పోతే C I దుర్గ ( అమల పాల్ ) కి కూడా ఇలాంటి కలలే వస్తుంటాయి. అస్సలు అది కి దుర్గ కి మధ్య సంబంధం ఏంటి ? ఒకరి కలలోకి ఇంకొకరు ఎందుకు వస్తున్నారు ? అస్సలు ఫిబ్రవరి 29 నా ఎం జరిగింది ? ఇవన్నీ తెలుసుకోవాలంటే కుడి కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఆహ లో చూసేయాల్సిందే.

kudi yedamaithe web series Review

👍🏻:-

  • రాహుల్ విజయ్ మరియు అమల పాల్ నటన చాల కొత్తగా మరియు విభినంగా ప్రేక్షకులను అలరిస్తాయి.
  • కథ కొత్తగా ఉంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
  • సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెబ్ సిరీస్ ని మరింత ప్లస్ లోకి నెట్టాయి.
  • మొదటి రెండు ఎపిసోడ్ లు మరియు చివరి రెండు ఎపిసోడ్ లు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
  • డైరెక్టర్ తనదైన శైలితో ప్రేక్షకులని రంజింపచేయాలనే తపన కనపడుతుంది.

👎🏻:-

  • కథనం సరిగ్గా రాసుకోలేకపోయారు.

*4,5,6 ఎపిసోడ్స్ చాల అంటే చాల బోర్ కోటిస్తాయి.

  • ప్రేక్షకులు ఒక సన్నివేశం తో ఇంకో సన్నివేశం కి కనెక్ట్ చేసుకోవడానికి చాల ఇబ్బంది పడుతారు.

ముగింపు :-

మొత్తానికి కుడి ఎడమైతే వెబ్ సిరీస్ కొత్తదనం తో ప్రేక్షకులని అలరిస్తుంది.. కొన్ని ఎపిసోడ్స్ బోర్ తెపించిన మొత్తం సిరీస్ పూర్తయేసరికి సిరీస్ పైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అమల పాల్ మరియు రాహుల్ విజయ్ సిరీస్ ని తమ నటనతో ప్రేక్షకులని కట్టిపడేస్తారు. కథ చాల కొత్తగా ఉంది. ప్రజలు అర్ధం చేసుకోవడానికి టైం పట్టచ్చు. దర్శకుడు తాను చూపెట్టాలనుకుంది కొంతవరకు విజయం సాధించాడని చెప్పాలి. మొత్తానికి ఈ వారం కుటుంబం తో ఈ వెబ్ సిరీస్ సరదాగా చూసేయచ్చు.

kudi yedamaithe web series Rating:- 2.75/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button