కుమార్ సాయి విషయంలో బిగ్ బాస్ తో పాటు నాగార్జునని ఏకి పారేస్తున్న జనాలు

కుమార్ సాయి బ్యాక్ బిచింగ్ చేతకాలేదు , మసాలా తో కూడిన మాటలు చేతకాలేదు , అలాగే హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్న నీకు తెలుగు వచ్చా అని అడిగితే నాకు అదొక్కటే వచ్చు అని చెప్పటం , లవ్ ఎఫ్ఫైర్స్ పెట్టుకోపోవటం , అలాగే గ్రూపిజం చేయకపోవటం , ఇవన్నీ బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధమని దాని వల్లే నువ్వు ఎలిమినెట్ అవుతున్నావని జనాలు బిగ్ బాస్ పైన ఆగ్రహం చూపిస్తున్నారు .
నిజానికి ఈ షో పైన చాల అపనమ్మకాలు ఉన్నాయి , ఈ బిగ్ బాస్ 4లో దేవి ఎలిమినేషన్ అపుడు మొదలైన అనుమానాలు , స్వాతి దీక్షిత్ తో అలాగే కుమార్ సాయి ఎపిసోడ్ తో మరిన్ని అపనమ్మకాలు మొదలయ్యాయి వెరసి ఈ షో పైన ముందు ముందు ఆదరణ పోయిన తప్పులేదు .
జెన్యూన్ గా ఆడే కంటెస్టెంట్స్ , వోటింగ్ పెర్సెంటేజ్ ఉన్న కాంటెస్టన్స్ ని తీసీవేయటం , ఓట్లు వేసిన జనాలని పిచోళ్ళని చేయటం ఈ బిగ్ బాస్ షో కి అలవాటు గా మారింది , వీళ్ళకి కావాల్సింది ఫుటేజ్ ఇచ్చే వాళ్ళు మాత్రమే అని మరో సారి ప్రూవ్ చేశారు .
ఈ ఎలిమినేషన్ పట్ల చాల మంది వీడియోలు చేసి మరి వదులుతున్నారు ఇదొక రకంగా జనల నుండి వస్తున్న నెగటివిటీ అని చెప్పొచ్చు