తాడిశెట్టి ప్రవీణ్ కుమార్ నిర్మాతగా వంశీ మునగల దర్శకత్వంలో లలిత క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 ప్రారంభం !!!
*తాడిశెట్టి ప్రవీణ్ కుమార్ నిర్మాతగా వంశీ మునగల దర్శకత్వంలో లలిత క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 ప్రారంభం !!!*
లలిత క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం శుక్రవారం ఫిలిం నగర్ దైవసన్నిధానంలో ప్రారంభం అయ్యింది. కార్తీక్, రూపా శ్రీదేవి హీరో హీరోయిన్లు గా వంశీ మునగల దర్శకత్వంలో తడిశెట్టి ప్రవీణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శశాంక్ భాస్కరుని సంగీతం అందిస్తున్నారు. నటుడు ఎమ్.ఎన్. రెడ్డి ముహూర్తం షార్ట్ కు క్లాప్ కొట్టగా నిర్మాత తాడిశెట్టి ప్రవీణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
*ఈ సందర్బంగా దర్శకుడు వంశీ మునగల మాట్లాడుతూ…*
లవ్ స్టొరీతో మీ ముందుకు వస్తున్నాము. హీరో కార్తిక్ గత కొన్ని ఏళ్లుగా నాకు తెలుసు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది, హీరోయిన్ రూపా శ్రీదేవి ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంటుంది. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేస్తున్న నిర్మాత తాడిశెట్టి ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు, మా చిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్న అథితులందరికి ధన్యవాదాలు తెలిపారు
*నిర్మాత తాడిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ*
డైరెక్టర్ వంశీ ఈ కథను నరేట్ చేసినప్పుడు కథ నచ్చింది. ఆడియన్స్ కు కావాల్సిన అంశాలు అన్నీ ఈ కథలో ఉన్నాయి. ఒకే షెడ్యూల్ లో సినిమాను పూర్తి చెయ్యబోతున్నాం. మా చిత్రంలో నటించబోతున్న హీరో హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలువుతున్నాను అన్నారు.
*హీరో కార్తిక్ మాట్లాడుతూ..*
డైరెక్టర్ వంశీ నేను మంచి ఫ్రెండ్స్, నాకు ఈ కథ చెప్పి నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నిర్మాత తాడిశెట్టి ప్రవీణ్ కుమార్ గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.
*హీరోయిన్ రూపా శ్రీదేవి మాట్లాడుతూ*
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నాకు తెలుగులో ఇది రెండో సినిమా. తెలుగుగమ్మాయి అయిన నన్ను మీ అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.
కార్తిక్ (హీరో)
రూపా శ్రీదేవి (హీరోయిన్)
*సాంకేతిక నిపుణులు:*
నిర్మాత: తాడిశెట్టి ప్రవీణ్ కుమార్
సహా నిర్మాత: గుర్జాల రమేష్
దర్శకత్వం: వంశీ మునగల
కెమెరామెన్: కిషన్ సాగర్
సంగీతం: శశాంక్ భాస్కరుని
లిరిక్స్: శ్రీమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.హనుమంత రావ్
పి.ఆర్.ఒ: గోపి కుమార్ సి.వి.ఆర్