telugu gods devotional information in telugu
ఈరోజు కార్తీక చివరి సోమవారం
ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన విశేషాలు.
ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి చిత్త నక్షత్ర యుక్త సోమవారం.కార్తీక మాసంలో చివరి సోమవారం.ఇప్పటివరకు కార్తీక మాసంలో ఎలాంటి పుణ్య కార్యం చేయని వారు ఈ సోమవారంనాడు ఉపవాసంతో పాటు అభిషేక అర్చనాదులు,శివాలయంలో దీపారాధన కు అత్యంత శ్రేయస్కరమైన రోజు.కార్తీక సోమవార ఉపవాస ఫలితం అన్నది మామూలుగా ఉండదని కార్తీక పురాణం తెలుపుతుంది.
ఈరోజు మరొక విశేషం కార్తీక శుద్ధ ఏకాదశి,ఈరోజు చేయు ఉపవాసం విష్ణు భగవానుల అనుగ్రహం కలుగుతుంది.ఆయా వ్యక్తుల శరీర ఆరోగ్యం అనుసరించి శుష్క ఉపవాసం కాని నిర్జల ఉపవాసం కాని నిలాహార ఉపవాసం కాని చేయవచ్చు.ఉపవాస కాలం లో శ్రీ హరి నామంతో కాలం గడపాలి.శుష్క,నిర్జల ఉపవాసం చెయువారు ద్వాదశి రోజు ఆ గడియలు దాటకుండా పారాయణ చేయాలి వీలయితే అన్న సమారాధనలు చేయవచ్చు.
ఓం నమో నారాయణాయ
ఓం నమశ్శివాయ