Tollywood news in telugu
ట్వీట్ల వర్షం తో రికార్డు సృష్టించిన ‘వకీల్ సాబ్’ !

పవన్ కల్యాణ్ స్టామినా కి తగట్టుగా ఉండే ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో హవా చాటుతుంది . బాలీవుడ్ లో విజయం సాధించిన ‘పింక్’ చిత్రం రీమేక్ గా తెలుగులో వస్తున్న ఈ వకీల్ సాబ్ కు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో ఈ సినిమా చేస్తున్నారు.
బోనీ కపూర్ ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా ‘వకీల్ సాబ్’ చిత్రం 2020లో ట్వీట్ల వర్షం తో రికార్డు సృష్టించిందని వెల్లడించారు. అతి త్వరలోనే పవర్ సత్తా ఏంటో చుడనున్నారని వెల్లడించారు తెలిపాడు.
ఇదిలా ఉంటె ‘పింక్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు డైరెక్షన్ వస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల పలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.