Tollywood news in telugu

గ్రాండ్ గా లైఫ్ స్టైల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!


కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన మందాడి జగన్నాథం ట్రైలర్ విడులచేశారు.గోరేటి వెంకన్న పాటలు విడుదల చేయగా,సినీ ప్రముఖులు చేతుల మీదుగా చిత్ర యూనిట్ ఆడియో ను విడుదల చేశారు.

అనంతరం మందాడి జగన్నాథం మాట్లాడుతూ:- నాకు ఇష్టమైన వ్యక్తుల్లో నిర్మాత నరసింహ ఒకరు. చాలా కష్ట జీవి,సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి.అటువంటిది నిర్మాత కష్టమైనా ఇష్టపడి ఇంత మంచి సినిమా తీస్తాడనుకోలేదు. సినిమాపై నాకు అవగాహన ఉందిగాని, సినిమా ఫంక్షన్ లకు రావడం చాలా తక్కువ.అటువంటిది నిర్మాతపై ఉన్న ఇష్టంతో ఈ ఫంక్షన్ కు వచ్చాను.అందరూ నాది లక్కీ హాండ్ అంటారు.ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.

*గోరేటి వెంకన్న మాట్లాడుతూ:-ట్రైలర్,పాటలు బాగున్నాయి. పాటల్లో ప్రేక్షకులకు మసాలా బాగా వడ్డించారు.ఇది సినిమాలో ఒక ఎంజాయ్ మెంట్ మాత్రమే,ఎవరికి నష్టం జరగదు.హీరోయిన్ నడుము చూసి కొంతమంది టికెట్స్ కొంటారు.యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.జగన్నాథం గారిది మంచి లక్కీ హాండ్, ఆయన చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి మరిన్ని సినిమాలు తీయాలని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కలకొండ నర్సింహ మాట్లాడుతూ…
కొన్ని సంవత్సరాల క్రితం 2g నెట్ వర్క్ ఉండేది. అప్పుడు మనుషులు చాలా పద్దతిగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం 4g నెట్ వర్క్ అప్డేట్ అయ్యిందిమ్ మనుషులు కూడా 4g నెట్ కోసం 4g మొబైల్ ఇష్టంగా తీసుకొని 4g కి, 4g మొబైల్ కి అంకితం అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరుకు 4g కి అలవాటుపడి చదువులు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లుతండ్రులను, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు.

దర్శకుడు సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ…

4g నెట్ ను అలవాటు పడి యువత బ్యాడ్ హ్యాబిట్స్ కు అలవాటు పడుతున్నారు. 4g మొబైల్ కు 4g నెట్వర్క్ ఎంత అవసరమో మనం కూడా మన ఫ్యామిలి కి అంతే అవసరం. ఈ విషయాలు సినిమాలో చెప్పడం జరిగింది. అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది. తప్పకుండా అందరికి మా లైఫ్ స్టైల్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను, ప్రస్తుత సమస్యలు, నిజజీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉండబోతున్న ఈ లైఫ్ స్టైల్ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

నటీనటులు:
నెహ్రు విజయ్
రోజా
నిఖిల్
సంతోషి.

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: కలకొండ నర్సింహ
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సి.ఎల్.సతీష్ మార్క్
సంగీతం: భాను ప్రసాద్.జె
సహా నిర్మాత: టాలివుడ్ యాక్టింగ్ స్టూడియో
లిరిక్స్: సతీష్ బండోజి
కెమెరామెన్: జేను
డైలాగ్స్: ఆవుసలి ఆంజనేయులు
ఎడిటర్: లోకేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button