Today Telugu News Updates
దుర్గంధం రావడంతో… ప్రేమజంట ఆత్మహత్యను గుర్తించిన స్థానికులు !

జగిత్యాల జిల్లా హైదర్ పల్లి లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి వారం రోజులై ఉంటుందని తేసుస్తుంది. ఒక ఇంటినుండి దుర్వాసన రావడంతో ఇంటి తలుపులు బద్దలు కొట్టగా ఉరి వేసుకొని రెండు శవాలు వేలాడటాని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, హైదర్ పల్లి కి చెందిన నలువాల మధు, సిరిసిల్ల జిల్లా కు చెందిన ఐలేని సౌమ్యా గా గుర్తించారు, వీరు గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని, సౌమ్య డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది, మధు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటాడని తెలిపారు.
అదేవిదంగా వీరి ప్రేమను పెద్దలు అంగీకరించక పోవడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.