Movie: లవ్ స్టొరీ రివ్యూ (2021) – Love Story Review

Movie Review: Love Story (2021)
Star Cast: నాగ చైతన్య , సాయి పల్లవి , రాజీవ్ కనకాల , ఉత్తేజ్, దేవయాని ,
Producers:- నారాయణ దాస్. కె. నరంగ్
Music Director :- పవన్
Director:- శేఖర్ కమ్ముల
Story:-
ఈ కథ లవ్ మీద శేఖర్ కమ్ముల గారి వాయిస్ ఓవర్ తో రేవంత్ ( నాగ చైతన్య ) చైల్డ్ హుడ్ సీన్స్ తో మొదలవుతుంది. కాలానుసారం రేవంత్ పెద్దయి జుమ్బా డాన్స్ సెంటర్ మొదలుపెడతాడు. అదే సమయం లో బి.టెక్ పూర్తి చేసుకొని జాబ్ ట్రైల్స్ కోసం హైదరాబాద్ లో రేవంత్ ఉన్న ఏరియా లోని ఇంట్లో దిగుతుంది మౌనిక ( సాయి పల్లవి ). జాబ్ ట్రయల్స్ వేస్తూనే రేవంత్ తో కలిసి పార్టనర్ గా జుమ్బ్ డాన్స్ సెంటర్ ప్రారంభిస్తారు. అంత హ్యాపీ గా సాగుతుంది కానీ ఒకరి మీద ఇంకొకరికి ఉన్న ప్రేమ గురించి చెప్పుకోరు. ఇదే సమయం లో రాజీవ్ కనకాల ఎంట్రీ తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. మౌనిక ఎందుకు జాబ్ ట్రైల్స్ పక్కన పెటేసి రేవంత్ కి తోడు గా నిలబడింది ? వీరిద్దరూ లవ్ ప్రపొసల్ ఎపుడు చేసుకున్నారు ? రాజీవ్ కనకాల ని చూసి మౌనిక ఎందుకు చాల భయపడుతుంది ? రేవంత్ మరియు మౌనిక కలిసి వారి ప్రేమను గెలిపించుకోవాడానికి ఎం ప్లాన్స్ వేశారు ? చివరికి వీరి ప్రేమ ఫలించిందా లేదా ? ఇవ్వని తెలుసుకోవాలంటే లవ్ స్టొరీ సినిమా థియేటర్ లో చూడాల్సిందే. .
Plust points 👍 :-
- ‘నాగ చైతన్య’ మరియు ‘సాయి పల్లవి’ వీరిద్దరూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమా మొత్తని వీరి భుజాల పైన వేసుకొని నడిపినట్లు అనిపించింది. మిగితా పాత్రలు ఉన్న వీరి పెర్ఫార్మన్స్ ముందు అవి పెద్దగా గుర్తింప పడవు. రాజీవ్ కనకాల బాగా చేసారు.
- శేఖర్ కమ్ముల మార్క్ కథనం.
- మ్యూజిక్ చాలా బాగుంది.
- శేఖర్ కమ్ముల దర్శకత్వం.
- ఎడిటింగ్ బాగుంది.
- సినిమాటోగ్రఫీ స్టైలిష్ గా ఉంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negative Points👎 :-
- రొటీన్ కథ.
- అక్కడక్కడా స్లో గా ఉంటుంది మరియు ల్యాగ్ అనిపిస్తుంది.
- హెవీ క్లైమాక్స్.
Final Verdict:-
మొత్తానికి ‘లవ్ స్టొరీ‘ సినిమా శేఖర్ కమ్ముల గారి స్టైల్ లో మరలా ప్రేక్షకులని అలరిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటనతో ప్రేక్షకులని కట్టి పడేస్తారు. రాజీవ్ కనకాల పాత్రా కూడా చాల బాగుంది. రొటీన్ కధనే అయినా శేఖర్ కమ్ముల గారు తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో అలరిస్తారు. మ్యూజిక్ చాల బాగుంది. పాటలకి సాయి పల్లవి మరియు చైతు డాన్స్ ఆన్ స్క్రీన్ సూపర్. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్ జనరల్ ఆడియన్స్ కి చాల అంటే చాల హెవీ అనిపిస్తుంది. మొత్తానికి నాగ చైతన్య , సాయి పల్లవి మరియు శేఖర్ కమ్ముల కలిసి ఒక చక్కటి లవ్ స్టోరీ ని ప్రేక్షకులకి ఇచ్చారు. ఈ వారం కుటుంబం అంత కలిసి ఈ సినిమాని సరదాగా చూసేయచ్చు.
Rating:- 3 /5