సినిమా :- MAD 2021 Movie

MAD movie (2021) : నటీనటులు :- రజత్ రాఘవ్, స్పందన పల్లి, మాధవ్ చిలుకూరి, శ్వేత వర్మ
నిర్మాతలు:- : టి వేణు గోపాల్ రెడ్డి, బి కృష్ణ రెడ్డి & స్నేహితులు
డైరెక్టర్ :- లక్ష్మణ్ మేనేని
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో MAD ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే MAD వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :-
ఈ కథ మ్యాడి (మాధవ్ చిలుకూరి) ని బాల్యం నుంచి ప్లే బాయ్ గా చూపిస్తూ మొదలవుతుంది. ఇంకో పక్క మాధురి (స్పందన) నిజమైన ప్రేమ కోసం తపిస్తూ ఉంటుంది. ఇలా వేరు వేరు ఆలోచనలతో ఉన్న వీరిద్దరికి పెళ్లి అయితే ఆ జంట ఎలా ఉండబోతుంది? వారిద్దరూ కలిసి ఉండగలరా? ఎలా జీవిస్తున్నారు? ఆలోచనలో మార్పు వస్తుందా రాదా? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూసేయాల్సిందే.
👍🏻:-
- నటీనటులు ఇద్దరు చక్కగా ప్రేక్షకులను అలరించే విధంగా నటించి మంచు ప్రశంశలు పొందారు.
- కథ బాగుంది.
- పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎🏻:-
- కథనం సరిగా రాసుకోలేదు.
- ఫస్ట్ హాఫ్ బోర్
ముగింపు :-
మొత్తానికి MAD Movie 2021 కథ కొత్తగా ఉన్న కధనం లో తప్పులు చేయడం వల్ల సినిమా పెద్దగా అలరించకపోవచ్చు. నటీనటులు ఇద్దరు బాగా చేశారు. ఎడిటింగ్ బాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులని పూర్తిగా అలరించే విషయం లో విఫలం అయిందనే చెప్పాలి. కాకపోతే నటీనటుల మంచి నటన కోసం ఈ సినిమాని ఓసారి చూసేయచ్చు.
రేటింగ్ :- 2/5