Tollywood news in telugu
మాధవన్ మార్వలెస్ గెటప్స్ …. సోషల్ మీడియాలో వైరల్ ఫొటోస్ !

తమిళ నటుడు ఆర్ మాధవన్ తెలుగులోనూ తన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. సఖి, చెలి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యన నెగిటివ్ పాత్రల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
మాధవన్ రొటీన్ కు భిన్నంగా కనిపించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇంత వరకు ఎవరు చూడని గెటప్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. వీటిలో ఛత్రపతి శివాజీ గెటప్ , మహారాజా గెటప్ తో మాధవన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ గెటప్స్ అన్ని సినిమాల కోసం ట్రైచేసినవి కానీ ఆసినిమాలేవీ పట్టాలెక్కలేదని పేర్కొన్నాడు.
ఈ సంవత్సరం అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి ప్రేక్షకాదన పొందాడు . ఇప్పుడు మారా అనే తమిళ చిత్రంతో పాటు రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ అనే సినిమాల్లో బిజిగా ఉన్నాడు.