Tollywood news in telugu

Mahesh Babu Won 25 Lakhs : 25 లక్షలు గెలుచుకున్న మహేష్ ? :-

Mahesh Babu Won 25 Lakhs

Mahesh Babu Won 25 Lakhs : మీరు చూసింది మేము రాసింది నిజమే. 25 లక్షలు ఆడి గెలుచుకున్న ” సూపర్ స్టార్ మహేష్ బాబు. ” ఇప్పటికి నమ్మసక్యంగా లేదా. అయితే ఇపుడు చుడండి.

ఇటీవలే మహేష్ స్టేజి పైన కనిపించారు. అది ఏ స్టేజి అనే కదా మీ ఆలోచన. ఆ స్టేజి లో మన ” జూనియర్ ఎన్టీఆర్ ” హోస్ట్ గా కనిపిస్తారు. ఇపుడు మీకు మ్యాటర్ క్లియర్ గా అర్ధం అయ్యింటది. ” మహేష్ బాబు ” స్పెషల్ గెస్ట్ గా తారక్ హోస్ట్ గా చేసే ” ఎవరు మీలో కోటీశ్వరులు ” షో కి వచ్చారు.

ఈ సందర్భంలోని ఫొటోస్ ఎవరో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో వైరల్ అయింది. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షో లో తెలిసిన వారిని అడగగా ఈ వార్త నిజమే అన్నారు. కాకపొతే కొంతమంది ఈ ఎపిసోడ్ ని దసరా కానుకగా టెలికాస్ట్ చేయబోతున్నారు అని చెప్పగా, మరికొందరు ఈ ఎపిసోడ్ ఫినాలే ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేయనున్నారు అని చెప్తున్నారు.

ఇదిలా ఉండగా గతం లో ” రాంచరణ్ ” కర్టెన్ రైజర్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి 25 లక్షలు గెలుచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ డబ్బులు చారిటీ కోసం అని అధికారికంగా వెల్లడించారు.

ఇపుడు ” మహేష్ బాబు ” కూడా ఈ షో ద్వారా 25 లక్షలు గెలుచుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా ఒకే స్టేజి పైన మహేష్ బాబు మరియు తారక్ కలిసి ఉంటె అక్కడ హుంగామ కి డోకా లేదు అని అందరికి తెలుసు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎపుడు టెలికాస్ట్ చేస్తారో మరి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button