పవన్ రికార్డు బద్దలు కొట్టిన మహేష్ ఫ్యాన్స్

Mahesh fans beaten pawan record :: ” పవన్ కళ్యాణ్” ఫాన్స్ తల్చుకుంటే సాధించనిదేది లేదు అంటూ ఇన్ని రోజులు అందరు అనుకున్నారు. ” జూనియర్ ఎన్టీఆర్ ” ఫాన్స్ ట్విట్టర్ లో హైయెస్ట్ బర్త్ డే ట్రెండ్ చేసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి చుక్కలు చూపిస్తే తట్టుకోలేని పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే దెబ్బకి రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి. ట్విట్టర్ లో రికార్డ్స్ బ్రేక్ చేయగానే పవన్ ఫాన్స్ ఆనందం మరవలేనిది. ఆ ఆనందం కొద్ది రోజులు కూడా ఉండకుండా చేసారు ” మహేష్ బాబు” ఫాన్స్.
పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చేయాలనే కసి తో మహేష్ బాబు ఫాన్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అనే పేరు మీద ట్రెండ్ చేసారు విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్విట్టర్ లో 27M ట్వీట్స్ చేస్తే మహేష్ బాబు ఫాన్స్ ” 31M ” ట్వీట్స్ చేసి బ్రేక్ ఈవెన్ రెకార్డ్ సృష్టించారు.
ఈ ఫాన్స్ వార్ ఇలాగె కంటిన్యూ చేస్తారా లేదా ఇంతటితో ఆపేస్తారో చూద్దాం.