Mahesh Babu: చత్రపతి శివాజీ గా మహేష్ బాబు?

Mahesh Babu: బాహుబలి సినిమా తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని శిఖరానికి పెంచిన డైరెక్టర్ రాజమౌళి… మారో “ఆర్ఆర్ఆర్” సినిమాతో సునామి సృష్టించేలా చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాల్లోని సన్నివేశాలన్ని రాజమౌళి శిల్పాన్ని చెక్కినటు చెక్కుతాడు కాబట్టి అభిమానులు ఆయనను జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు.

ఈ చిత్రం చత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా కథను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు చత్రపతి శివాజీ పాత్ర పోషించబోతున్నాట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో అబద్ధమెంతో తెలియదు కానీ..ఈ వార్త విన్న మహేష్ అభిమానులు ఖుషి గా ఉన్నారు.

