Tollywood news in telugu

భారీ బడ్జెట్ తో మహేష్ –సుకుమార్ మూవీ

ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మహేష్ ఈ గెలుపు హుషారుతో తన 25వ సినిమాను మొదలుపెట్టాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజు-పీవీపీ-అశ్వినీదత్ లు సంయుక్తoగా కలిసి భారీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ ఈ చిత్రంలో రెండు వేరు వేరు లుక్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం mahesh తొలిసారి గడ్డం,మీసాలు పెంచి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది.

ఈ సినిమా తరువాత mahesh చేయబోయే సినిమా ఎవరితో ఉండబోతుందనే క్లారిటీ ఇప్పటికే ప్రకటించాడు. రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ తన 26 వ చిత్రం చేయనున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం గురించి ఫిలింనగర్ లో ఒక న్యూస్ వినిపిస్తుంది.  ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ రూ.150 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని తెలుస్తోంది. కథా కథనాల పరంగా పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయనున్నారట. అందుకే ఇంతటి భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణలు వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది.  మహర్షి రిలీజ్ తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తున్నది. ఇంతకుముందు సుకుమార్, mahesh కాంబినేషన్లో ‘వన్ నేనొక్కడినే’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో కూడా బాలీవుడ్ తరహాలో చిత్ర నిర్మాణానికి భారీ మొత్తంలో బడ్జెట్ ని ఖర్చు పెట్టడం ఎక్కువ అయ్యింది.  టాప్ హీరోల సినిమాల బడ్జెట్ దాదాపుగా రూ. 70 కోట్ల నుండి 100 కోట్ల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ బడ్జెట్ 150 కోట్లనుండి 200 కోట్లు కూడా టచ్ అవుతోంది.  ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని సమాచారం. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించలేదు. కాని ఈ సారి మాత్రం అలాంటి పొరపాట్లు తలెత్తకుండా సుకుమార్ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button