Make Way For Radhe Shyam : రాధే శ్యామ్ హవా షురూ :-

Make Way For Radhe Shyam : ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే తరుణం రానే వచ్చేసింది. ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ పుట్టినరోజుని గ్లోబల్ ప్రభాస్ డే అని ఏకంగా ప్రభాస్ ఏ తన సోషల్ మీడియా లో వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చే అప్ డేట్స్ లో ముందుగా రాధే శ్యామ్ సినిమా అప్ డేట్ రాబోతుందని ప్రభాస్ ఏ అధికారికంగా వెల్లడించారు. అదేంటంటే రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి సంబందించిన వీడియో విడుదల చేయబోతున్నారు.
ప్రభాస్ తన సోషల్ మీడియా లో విక్రమాదిత్య ఎవరు ? ఇతని గురించి తెలుసుకోవాలంటే అక్టోబర్ 23 న ఉదయం 11:16 నిమిషాలకు తెలుసుకుంటారు అని చెప్పకనే చెప్పారు. ఈ స్పెషల్ వీడియో యొక్క స్పెషలిటీ ఏంటంటే ఈ వీడియో ఇంగ్లీష్ భాషలో మాత్రమే విడుదల చేయబోతున్నారు కాకపోతే సబ్ టైటిల్స్ వివిధ భాషలో ఉండబోతుంది అని ప్రభాస్ చెప్పారు.
ప్రభాస్ ఏది చేసిన స్పెషల్ గానే ఉండేటట్లు చూస్తున్నారు. చూడాలి మరి ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చే రాధే శ్యామ్ క్యారెక్టర్ వీడియో ఏ రేంజ్ లో ఉండబోతుందో అని. దానికి తోడు ప్రభాస్ రాధే శ్యామ్ చిత్ర బృందం కూడా తగ్గేదెలా అంటూ మరల ఈ సినిమా సంక్రాంతికి అనగా జనవరి 14 న విడుదల చేయబోతున్నాము అని అధికారికంగా ప్రకటించారు. చూడాలి ఎం జరగబోతుందో.