Mamata Benarji: సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా

రోజు రోజుకి తెలుగు భాష అన్ని రాష్ట్రాల్లో కి వ్యాప్తి చెందుతుంది.ముందు తెలుగు మాట్లాడే వారు అంటే ఏపీ, తెలంగాణలోనే ఉంటారని అనుకునే వారు కానీ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ తెలుగువారు ఉన్నారు. దీంతో ఆ రాష్ట్రా ప్రభుత్వాలు తెలుగును అధికార భాషగా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మంగళవారం జరిగిన క్యాబినెట్ లో తెలుగు అధికారభాషగా బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ
ప్రకటించారు. ఇప్పటికే బెంగాల్లో ఎన్నో అధికార భాషలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ లో ఖరగ్పూర్ లో తెలుగువారు ఎక్కువ ఉంటారు. కొందరు తెలుగు వాళ్లయితే బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు . ఖరగ్పూర్ లో 35 వార్డులలో ఆరుగురు కౌన్సిలర్లు తెలుగు వారే ఉండడం విశేషం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర తదితర భాషలకు కూడా అధికార హోదా ప్రకటించిన విషయం తెలిసిందే.
