మంచు లక్ష్మి కూతురు వైద్యనిర్వాణ అరుదైన రికార్డ్…మురిసిపోతున్న మంచు ఫ్యామిలీ !

vidya nirvana : మంచు వారి కుటుంబానికి మరువలేని గౌరవం దక్కింది. ఈ గౌరవం మంచులక్ష్మీ కూతురు వైద్యనిర్వాణ సాధించింది. తనకి చెస్ పైన ఉన్న ఇష్టాన్ని ఈ విదంగా ప్రజలకు తెలిసేలా చేసింది. వైద్య ఇంత చిన్న వయసులోనే ‘నోబెల్ బుక్ అఫ్ రికార్డ్ ‘ సాధించి ‘యంగెస్ట్ చెస్ ట్రైనర్ ‘ గా చోటు సంపాదించుకుంది.
వైద్య కి అవార్డు ప్రతినిధి బాలాజీ సర్టిఫికెట్ ని ప్రదానం చేసారు. ఈ సందర్బంగా వైద్య తాత మోహన్ బాబు , మామయ్యలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తరువాత మంచు లక్ష్మి మాట్లాడుతూ నా కూతురు చిన్నప్పటినుండి చాల ఆక్టివ్ గా ఉండేదని , ఎపుడు చేసుబోర్డు తో ఆడుతూ కాలక్షేపం చేసేదని , స్టాటింగ్ లో అంతగా పట్టించుకోలేదు, కానీ ఒకానొక సందర్భంలో తనకున్న ఇష్టాన్ని గమనించి చెస్ లో ట్రైనింగ్ ఇప్పించానని తెలిపింది. పిల్లలకు చదువుతో పాటు వారి ఇష్టాలను తెలుసుకొని ఉన్నతమైన శిఖరాలకు చేరుకునేలా చేయాలనీ వెల్లడించారు.