500 కోట్లు దానం చేసిన టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా?

మందాడి ప్రభాకర్ రెడ్డి … తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు.. ఒకప్పుడు హీరోగా, విలన్ గా సహాయ నటుడిగా నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా తుంగతుర్తి గ్రామంలో జన్మించారు. మందాడి లక్ష్మారెడ్డి-కౌసల్యకు దంపతులకు పుత్రుడిగా ప్రభాకర్ రెడ్డి జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రభాకర్ రెడ్డి డాక్టర్ గా సేవలందిస్తున్న సమయంలో… “చివరకు మిగిలింది” చిత్రంతో రంగస్థలానికి పరిచయమయ్యాడు. క్రమక్రమంగా అవకాశాలు పెరగడంతో వైద్య వృత్తిని విడిచిపెట్టాడు. ఆయన భీష్మ, తల్లిదండ్రులు కొడుకు, పాండవ వనవాసం సహా 400 చిత్రాలకు పైగా నటించి, ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు.
1990లో తెలుగు పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేద కళాకారులకు దానంగా అందించారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో…అప్పట్లో కొండలు, చెట్లుతో ఉన్న 10 ఎకరాల భూమి ఇప్పుడు విలాసవంతమైన భవనాలతో నిండి ..చిత్రపురి కాలనీ గా మారింది. ఇప్పుడు ఈ చిత్రపురి కాలనీ లో 90% నివాసితులు నటులే కావడం విశేషం. ఇప్పుడు ఈ భూమి విలువ 400 కోట్లుకు ఎక్కువగానే ఉంటుంది … ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక్క నటుడు 400 కోట్లు దానం చేశాడం అనేది గొప్ప విషయం…..