Maniratnam and Soundarya Rajinikanth individually working on same project : ఒకే కథ తో సినిమా మరియు వెబ్ సిరీస్ :-

Maniratnam and Soundarya Rajinikanth individually working on same project : అవును మీరు చదివింది నిజమే. తెలిసి చేస్తున్నారో , తెలియక చేస్తున్నారో అర్ధం అవడం లేదు. ఇన్ని రోజులు టాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ అయినా సినిమాలే స్టార్ హీరోలు రీమేక్స్ చేయడం చూశారు. ఇపుడు రిలీజ్ కానీ సినిమా మరియు వెబ్ సిరీస్ లవి ఒకే కథ అంటే నమ్మసక్యంగా ఉందా. కానీ నమ్మాలి ఎందుకంటే అదే నిజం కాబ్బటి.
మ్యాటర్ లోకి వెళ్తే తమిళ స్టార్ డైరెక్టర్ అయినా మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారని దాని పేరు పొన్నియిన్ సెల్వన్. ఇది ఒక చారిత్మాక చిత్రం. ఇందులో విక్రమ్ , కార్తీ , ఐశ్వర్య రాయి , త్రిష , జయం రవి ఇలా చాల భారీ తారాగణం తో ప్లాన్ చేసి షూటింగ్ చాల మటుకు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని రెండు భాగాలుగా చేస్తున్నారు. మొదటి భాగం 2022 లో విడుదలన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు కూడా.
ఇపుడు ఇదే కథ ని వెబ్ సిరీస్ రూపం లో అదే టైటిల్ పొన్నియిన్ సెల్వన్ అని పెట్టి యమ్ ఎక్స్ ప్లేయర్ లో విడుదల చేయాలనీ ఒక టీం సిద్ధం అయింది. ఆ టీం మరెవరో కాదు. క్రియేటివ్ డైరెక్టర్ గా సౌందర్య రజినీకాంత్ మరియు శరత్ కుమార్ జ్యోతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్స్ తో ఉండబోతుందని సిరీస్ బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ సిరీస్ విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.
అయినా మణిరత్నం గారు ఇదివరకే చాల వరకు షూటింగ్ అయిపోకొట్టిన కథనే సిరీస్ రూపం లో సౌందర్య రజినీకాంత్ ముందుకు రావడం ప్రేక్షకులకు ఎం అర్ధం అవ్వడం లేదు. మన టాలీవుడ్ లోనే రాజమౌళి తీసిన బాహుబలి సినిమాని చూసి ఆదరించిన ప్రేక్షకులు , అదే బాహుబలి ని యానిమేషన్ రూపం లో వెబ్ సిరీస్ లా తీస్తే ఎవరు చూడలేదు.
బాహుబలి లాగే ఈ పొన్నియిన్ సెల్వన్ అవుతుందని భయపడుతున్నారు. చూడాలి మరి రెండు చిత్ర బృందాలు ఎం చేయబోతున్నారో.