Kajal Aggarwal: తన సొంత కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మరీన కాజల్ !

ముంబై మహానగరంలో ఓక ప్రముఖ డిజైనింగ్ కంపెనీకి చెందిన అధినేత గా కాజల్ భర్త గౌతమ్ సక్సెస్ సాధించాడు. కిచ్లు కి ముంబై సిటీ లో మంచి బిజినెస్ మ్యాన్‌గా పేరుంది .ఇప్పుడు కిచ్లు కి తోడుగా కాజల్ అగర్వాల్ వచ్చేసింది. దీనితో ఇప్పుడు కాజల్ ఇమేజ్‌ను తన కంపెనీ కోసం ఉపయోగించనుంది.
కిచ్లుకి సంబంధించిన ఇ-కామర్స్ సంస్థ ‘డిస్కర్న్ లివింగ్’ కి సపోర్ట్ గా ఉంటానంటుంది. ఈ సంస్థ కోసం కాజల్ చేస్తున్న యాడ్స్ త్వరలో టెలివిషన్ లలో రానున్నాయి. తన భర్త కంపెనీకి సంబంధించిన డిజైనింగ్ గురించి కాజల్ తన అభిమానులకు ట్వీట్స్ ద్వారా పరిచయం చేస్తుంది. ఇలా తన భర్త కంపెనీకి కావాల్సినంత ప్రమోషన్ చేయడం కూడా మొదలుపెట్టింది. డిస్కర్న్ లివింగ్ కోసం ప్రత్యేకంగా ఒక బ్రోచర్స్ కూడా రిలీజ్ చేసింది.
ప్రతీ ఏడాదికి కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే ఈ కంపెనీ కోసం కాజల్ అభిమానుల అండదండలు కూడా తోడయ్యాయి . ప్రస్తుతం కాజల్ వరస గా సినిమాలు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకోనుంది కాజల్ కిచ్లు .