Tollywood news in telugu
ఇలాంటి క్వాలిటీస్ ఉన్నఅబ్బాయిని పెళ్లి చేసుకుంటా: రకుల్ ప్రీత్ సింగ్

ఈ బిజీ లైఫ్ లో కొన్ని రోజులు రిలాక్స అవడానికి రకుల్ మాల్దీవ్స్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కి తిరిగొచ్చింది. వర్కవుట్స్, సినిమా షూటింగ్స్‌తో మల్లి బిజీ అయిపోయింది. ఇక విషయానికి వస్తే రకుల్ తనకు కాబోయే భర్త విషయంలో కొన్ని అభిప్రాయాలు తెలిపింది .
భారతీయ సంప్రదాయ వివాహాంపై పూర్తి నమ్మకం కలిగిన అబ్బాయినే పెళ్లాడతానని వెల్లడించింది . నాకు కాబోయే భాగస్వామికి జీవితం అంటే మంచి అభిరుచి ఉండాలి. బంధాలకు,బాంధవ్యాలు విలువిచ్చే వాడై ఉండాలి. మా కుటుంబం ఆర్మీ నేపథ్యం కలిగినది కావున నా జీవితంలో వచ్చే వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఉండాలి.
ఇక నా పెళ్లి కేవలం మా మందువుల మధ్య కొంతమంది స్నేహితుల మధ్య జరిగేలా ప్లాన్ చేస్తా అని చెప్పుకొచ్చింది.