లక్షన్నర పెడితే… మంచి బ్రాండెడ్ కారు.. మీ సొంతం…!

ఎవరికైనా కొత్త కార్ కొనాలనుకుంటే షో రూమ్ కి వెళతాం లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం… ఇదంతా బానే వుంది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఒక కారును కొనుగోలు చేయలేకా.. ఆ ధరలు చూసి కారు కొనుగోలు చేయాలన్న కోరిక లు, ఆశలు ఆడిఆవిరైపోతాయి.

అలాంటి వారి కోసమే ఒక ప్రముఖ సంస్థ ఆన్లైన్లో చాలా చీప్ గా సెకండ్ హ్యాండ్ కార్లు ను అందుబాటులోకి తెచ్చారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…

ప్రముఖ కార్ల కంపెనీ అయిన మారుతి కంపెనీ వారు సెకండ్ హ్యాండ్ వాహనాలను విక్రయిస్తున్నారు. ఆ వాహనాలను మారుతీ సుజుకీ ట్రూవ్యాల్యూ వెబ్ సైట్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుదారులు బుక్ చేసుకోవచ్చు.
మొదట వెబ్ సైట్లోకి ఎంటర్ అయినప్పుడు మీ పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత మీరు ఒక కారు బుక్ చేసుకున్న తర్వాత… మీరు ఒక కార్ టెస్ట్ రైడ్ కూడా వెళ్ళచు. ప్రస్తుతం ఈ కార్లు హైదరాబాద్, కర్నూల్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
మీకు మారుతి సుజుకి షిఫ్ట్(model 2006) కార్ ను రూ.లక్షన్నర కే కొనుగోలు చేయవచ్చు. మారుతీ డిజైన్ (Model:2009) కారును రూ.2.8 లక్షలకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. అలాగే 3.6 లక్షలు ఉంటే బాలెనో కారు మీ సొంతం.