Mass Maharaja Raviteja in and as Dhamaka : మాస్ మహారాజ రవితేజ ధమాకా :-

Mass Maharaja Raviteja in and as Dhamaka : ఏంటి హెడ్డింగ్ సంబంధం లేకుండా ఉందని ఆలోచిస్తున్నారా. కచ్చితంగా హెడ్డింగ్ కి సంబంధం ఉంది. మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ఎన్ని సినిమాలు అనౌన్స్ చేసిన ఏ సినిమాని తక్కువ చేయకుండా ఇబ్బంది కలగకుండా కాల్ షీట్స్ కేటాయించి పర్ఫెక్ట్ ప్లాన్ తో షూట్ చేస్తున్నారు. అయితే రవితేజ చేస్తున్న సినిమాలలో త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో ఒకటి ఉంది. ఈ సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇదివరకే ఘనంగా జరిగాయి.
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని అందరికి తెలిసింది. అయితే త్రినాధ్ రావు నక్కిన స్టైల్ అఫ్ కామెడీ చాల కొత్తగా ఉంటుందని ఆయన గత సినిమాలు చూస్తేనే తెలిసిపోతుంది. త్రినాధ్ రావు నక్కిన మరియు రవితేజ చేసే కామెడీ సినిమాకి టైటిల్ గా ధమాకా అని పెట్టడం జరిగింది.
ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేసుకొని ఫిబ్రవరి 2022 లో విడుదల చేయాలనీ సన్నాహాలు కూడా చేస్తున్నారు. చూడాలి మరి త్రినాధ్ రావు నక్కిన మరియు మాస్ మహారాజ కాంబినేషన్ లో వచ్చే సినిమా ధమాకా ప్రేక్షకులని ఏ రేంజ్ లో అలరించబోతుందో..