Tollywood news in telugu

Mass Maharaja Raviteja Pan India Film Fixed : ప్యాన్ ఇండియా లెవెల్ లో మాస్ మహారాజ సినిమా :-

Mass Maharaja Raviteja Pan India Film Fixed

Mass Maharaja Raviteja Pan India Film Fixed : దాదాపు 70 సినిమాల తర్వాత మాస్ మహారాజ రవితేజ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. తెలుగు , హిందీ , కన్నడ , తమిళ్ , మలయాళం బాషలలో రవితేజ సినిమా విడుదల కాబోతుంది.

మ్యాటర్ లోకి వెళ్తే మాస్ మహారాజ రవితేజ వరుస సినిమా సైన్ చేస్తూ , ఒక్కేసారి 3 సినిమాల షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీ గా కాలం గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొన్న రవితేజ 70 వ సినిమా సుధీర్ వర్మ తో ఉండబోతుందని అధికారిక ప్రకటన జరిపాక ఆలస్యం చేయకుండా రవితేజ 71 వ సినిమాకి సంబందించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఇన్ని అప్డేట్స్ చూస్తూ రవి అభిమానుల దిల్ కుష్ అయిందనుకోండి. అయితే రవి అభిమానుల ఆనందం రెట్టింపు అవడానికి గల కారణం అయన చేయబోయే 71 వ సినిమా. అదేనండి ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా రవితేజ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారని.

పోతే రవితేజ 71 వ సినిమా టైటిల్ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా బయోపిక్ లాంటిది. టైగర్ నాగేశ్వరరావు యొక్క జీవిత ఆధారంగా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇయన గురించి అందరూ తెలుసుకోవాలని ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ని అభిషేక్ అగర్వాల్ నిర్మించగా వంశీ దర్శకత్వం వహించబోతున్నారు.

మొత్తానికి రవితేజ అభిమానులు ఈ వార్తతో దీపావళి సంబరాలు డబల్ హ్యాపీనెస్ తో సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button