మీమర్స్ కడుపు కొడుతున్న మెగా హీరోలు..!

ముందు ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ వీడియోలు చూసేవారు.. కానీ ఇప్పుడు మిమీస్ ని ఫాలో అవుతున్నారు.ఆ మీన్స్ చూస్తుంటే ఎవరైనా పగలబడి నవ్వాల్సిందే. అందుకే పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా ఆ మిమీస్ పేజీలను ఫాలో అవుతూ ఉండటం చూస్తూ ఉంటాం.. కానీ ఈసారి మెగా హీరోలు ఏకంగా మిమీస్ వాడడం మొదలు పెట్టారు.
ఈ మేరకు బుధవారం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ ఫన్నీ కాన్వర్జేషన్ తో డైరెక్టర్ కొరటాల శివ తో మాట్లాడుతున్నట్టు మిమీస్ పెట్టాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయి.. మెగాస్టార్ కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ఆచార్య అప్డేట్ పై మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఒక మిమ్ ద్వారా స్పందించాడు. చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్ కి.. బయట టాక్’ అంటూ బ్రహ్మానందం ఎమోజీ తో ట్వీట్ వేసాడు. దీంతో మిమార్స్ మా కడుపు కోటకండి సర్ అన్ని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు