Telugu Heroes

Chiranjeevi Age And Bio

Megastar Chiranjeevi Age

Megastar Chiranjeevi Age : ఆగష్టు 22 , 1955 లో ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి లో మొగల్తూరు గ్రామం లో ఒక స్టార్ పుట్టారు. అయన పేరు అప్పట్లో కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, మరియు వరల్డ్ వైడ్ ఆయనని మెగా స్టార్ చిరంజీవి అనే పిలుస్తారు. తండ్రి కానిస్టేబుల్ కావడం తో తరుచు ట్రాన్స్ఫర్ జరిగేవి , కాబట్టి తాను అమ్మమ్మ వాలా ఊరిలోనే బాల్యం ఎక్కువగా గడిపేసేవారు.

Tollywood Megastar Age

ఇంటర్మీడియట్ ఒంగోలు లోని సి. యస్. ఆర్. శర్మ కాలేజీ లో పూర్తి చేసి నర్సాపురం లో శ్రీ వై. యాన్. కాలేజీ లో డిగ్రీ అఫ్ కామర్స్ అనే పట్టా పొందారు. 1976 లో సినిమా పై ఆశక్తి కలగడం తో చెన్నై లోని మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారు.

ఫిబ్రవరి 20 , 1980 లో చిరంజీవి , అల్లు రామలింగయ్య గారి కూతురు అయినా సురేఖని వివాహమాడారు. వీరికి సంతానం గా శ్రీజ , సుష్మిత అనే ఇద్దరు కూతుర్లు మరియు కొడుకుగా రామ్ చరణ్ పుట్టారు. చిరంజీవి కి ఇద్దరు సోదరులు. ఒకరు నాగబాబు. ఈయన సినిమాలోనూ , టీవీ లోని కనిపిస్తారు మరియు సినీ నిర్మాత కూడా. చివరి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఈయన యాక్టర్ , ప్రొడ్యూసర్ జనసేన పార్టీ అధినేత. బావ వరస అయ్యే అల్లు అరవింద్ సినీ నిర్మాత. ఇతని కుమారులు అల్లు అర్జున్ అల్లు శిరీష్.

అయితే చిరు 1978 లో పునాదిరాళ్ళు అనే సినిమా షూటింగ్ చేసినప్పటికీ , మొదటి సినిమా గా ప్రజలముందుకు వచ్చింది మాత్రం ప్రాణం ఖరీదు. అప్పట్లో చిరు వేసే డాన్స్ లకి థియేటర్ దద్దరిల్లిపోయేది. అప్పట్లోనే బ్రేక్ డాన్స్ లో చిరు ని మించినోళ్లు లేరు అనుకునేలా డాన్స్ చేసేవారు.

1987 లో అయన తీసిన స్వయం కృషి అనే సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది అంటే మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రష్యన్ భాషలో డబ్బింగ్ చేసి మరి స్క్రీనింగ్ చేశారు. చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు మరియు నంది స్టేట్ అవార్డు దక్కించుకున్నారు ఈ సినిమాకి.

1988 లో రుద్రా వీణ అనే సినిమాకి సహా నిర్మాత గా చేశారు. ఈ సినిమాని బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటెగ్రేషన్ లో , నేషనల్ ఫిలిం అవార్డు దక్కించుకుంది. సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 39 సంవత్సరాలలో 4 నంది అవార్డ్స్ , రఘుపతి వెంకయ్య అవార్డు , 10 ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ దానితోపాటు ఫిలిం ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సౌత్ గెలుచుకున్నారు. 2006 లో అయన సినీ పరిశ్రమ కి చేసిన సేవకి కాను పద్మభూషణ్ అవార్డు తో సత్కరించారు.

2008 లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లో 18 సీట్లు గెలుచుకున్నారు. అయన తిరుపతి మరియు పాలకొల్లు లో పోటీచేయగా తిరుపతి లో గెలిచారు. 2011 లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కలిపేశారు. కాంగ్రెస్ లో కలిపేశాక సుమారు ఏడాది పైగా అనగా 2012 లో కాంగ్రెస్ తరుపున రాజ్య సభలో నామినేషన్ వేశారు.

అంతా మంచి జరిగి 2012 ఏప్రిల్ లో రాజ్య సభ మెంబెర్ గా పదవి స్వీకరణ చేశారు. 2012 అక్టోబర్ లో ఇండిపెండెంట్ యూనియన్ మినిస్టర్ అఫ్ స్టేట్ ( మినిస్ట్రీ అఫ్ టూరిజం , గవర్నమెంట్ అఫ్ ఇండియా ) గా పదవిలో కూర్చున్నారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగాక కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ వదిలి వెళ్ళిపోయినా చిరు మాత్రం కాంగ్రెస్ తరుపున ఎలక్షన్ కాంపెయిన్ చేశారు. కానీ అప్పటికే కాంగ్రెస్ పైన ఆంధ్ర ప్రజలకు దురభిప్రాయం ఉండటం తో 10 శాతం కంటే తక్కువనే సీట్స్ గెలుచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటినుంచి చిరు పాలిటిక్స్ కి దూరం అయ్యారు. అప్పటినుంచి కాంగ్రెస్ లో జరిగిన ఏ ఒక్క మీటింగ్ కి చిరు హాజరు కాలేదు. రాజ్య సభ మెంబెర్ గా అతని గడుపు 2018 లో ముగియడంతో పూర్తిగా పాలిటిక్స్ కి దూరం అయిపోయారు.

రాజ్య సభ మెంబెర్ గా ఉన్నపటినుంచే మరల సినిమా ఇండస్ట్రీ లో కమ్ బ్యాక్ ఇయాలని ఫిక్స్ అయ్యి 2017 లోనే ఖైదీ నెంబర్ 150 అనే సినిమా ద్వారా మళ్ళీ ఫాన్స్ ముందుకు మెగా స్టార్ చిరంజీవి గా వెండితెర పై తిరిగి వచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహ రెడ్డి , ఇపుడు ఆచార్య , గాడ్ ఫాదర్ , భోళా శంకర్ ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

పేరు :- కొణిదెల శివ శంకర వర ప్రసాద్

ముద్దు పేరు :- చిరు

డేట్ ఆఫ్ బర్త్ :- 22 ఆగస్టు 1955

Mega Star Chiranjeevi Age :- 66

రాశి :- సింహం

ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 9 అంగుళాలు

బాడీ కొలతలు :- 42 – 34 – 13

                    చెస్ట్ - 42
                    వెయిస్ట్ :- 34
                    బై సెప్స్ :- 13

తల్లిదండ్రులు :- వెంకటరావు కొణిదెల, అంజనా దేవి కొణిదెల

సోదరి – సోదరులు :- నాగేంద్ర బాబు (చిత్ర నిర్మాత), పవన్ కళ్యాణ్ (నటుడు), విజయ దుర్గ, మాధవి.

భార్య :- సురేఖ కొణిదెల

కుమారులు / కుమార్తెలు :- రామ్ చరణ్ తేజ (నటుడు ) , శ్రీజ, సుస్మిత

అత్త మామలు :- అల్లు రామలింగయ్య , అల్లు కనకరత్నం

స్కూల్ :- శ్రీ వైఎన్ కళాశాల, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్

కాలేజ్ :- CSR శర్మ కళాశాల, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ (ఇంటర్మీడియట్)

విద్య అర్హత :- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com)

లొకేషన్ :- మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.

ప్రస్తుత నివాసం :- జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

ఇష్టమైన నటుడు :- సీన్ కానరీ

ఇష్టమైన నటి :- మహానటి సావిత్రి

హాబీస్ :- గానం

ఇష్టమైన హాస్య నటుడు :- చార్లీ చాప్లిన్

ఇష్టమైన నిర్మాత :- డి. రామానాయుడు

ఇష్టమైన గాయకుడు :- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

మొదటి సినిమా :- పునాదిరాళ్లు (1979, తెలుగు) ,
రానువ వీరన్ (1981, తమిళ్) ,
ప్రతిబంధ్ (1990, హిందీ) ,
సిపాయి (1996, కన్నడ)

రెమ్యునరేషన్ :- 30-40 కోట్లు/సినిమా

అవార్డ్స్ :-

  • 2006 లో పద్మభూషణ్ (భారత ప్రభుత్వం) అవార్డ్.
  • నంది అవార్డ్స్ కేటగిరీ లో 1987 న స్వయం కృషి కొరకు ఉత్తమ నటుడు.
    1992 న ఆపద్బాంధవుడు కొరకు ఉత్తమ నటుడు.
    2002 లో ఇంద్ర కొరకు ఉత్తమ నటుడు దక్కించుకున్నారు.
  • ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కేటగిరీ లో 1982 లో శుభలేఖకు ఉత్తమ నటుడు. , 1985 లో విజ్జేత కొరకు ఉత్తమ నటుడు , 1992 లో ఆపద్బాంధవుడు కొరకు ఉత్తమ నటుడు, 1993 లో ముఠా మేస్త్రి కొరకు ఉత్తమ నటుడు, 1999 లో స్నేహం కోసం, 2002 లో ఉత్తమ నటుడు ఇంద్ర , 2004 కొరకు ఉత్తమ నటుడు శంకర్ దాదా MBBS,
    2006 లో దక్షిణ నటుడు గౌరవ పురాణ నటనా వృత్తి (ప్రత్యేక పురస్కారం) , 2010 లో జీవిత సాఫల్య పురస్కారం – దక్షిణ
  • ఇతర అవార్డ్స్ కేటగిరీ లో 1988 లో సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు – స్వయం కృషి కొరకు ఉత్తమ నటుడు గా , 2006 లో ఆంధ్రా యూనివర్సిటీ 2014 నుండి గౌరవ డాక్టరేట్
    సైమా అవార్డ్స్ – ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా.

ఇలా చిరు తన కెరియర్ లో ఇన్ని అవార్డ్స్ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button