ఆ కారణంతోనే మైకెల్ ఇల్లు తక్కువకు అమ్ముడుపోయింది !

Michael Jackson’s Neverland sold: పాప్ స్టార్ గా ఎదిగిన మైకెల్ జాక్సన్ 2009 జూన్ 25న అనుమానస్పద రీతిలో చనిపోయాడు. ఇతను ఎక్కువరోజులు కాలిఫోర్నియాలోని ‘నెవర్ ల్యాండ్’ లోనే ఉండేవాడు. మైకేల్ కి ఈ ఇళ్ళంటే ఎంతో ఇష్టం .ఈ ఇంటిని సుమారు 2700 ఎకరాల్లో ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నాడు.
జాక్సన్ మరణించిన తర్వాత ఈ ఎస్టేట్‌ను థామస్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియన్ల డాలర్లకు దక్కించుకుంది. ఇపుడు తాజాగా నెవర్ ల్యాండ్‌ను అమెరికాకు చెందిన ధనవంతుడు ‘రాబ్ బర్క్లే’ 22 మిలియన్ల డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
గతం లో ఇదే ఎస్టేట్‌ను వంద మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నిచారు. కానీ బర్ల్కే ఇప్పుడు కేవలం 22 మిలియన్ల డాలర్లకే కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఈ ఇంటిలో మైకేల్ చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ ఇంట్లో జాక్సన్ దయ్యమై తిరుగుతున్నాడని పుకార్లు వెలువడ్డాయి. ఈ కారణంగానే ఈ ఎస్టేట్ తక్కువ కు అమ్ముడుపోయిందని ప్రచారం.