Tollywood news in telugu

‘మిషన్ ఇంపాజిబుల్’ టైటిల్ తో వస్తున్న బాలల చిత్రం !

Mission Impossible

పెద్ద నిర్మాణసంస్థల్లో ఒక్కటైన ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్’  ఇప్పుడు కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తుంది.  ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి మంచి సినిమాలకు  దర్శకత్వం వహించిన  స్వరూప్ ఆర్ఎస్ జె తో ఓ సినిమా చేస్తుంది. వైవిధ్యమైన స్టోరీ తో  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

శనివారం పూజా కార్యక్రమాలతో  ఈ సినిమా ని స్టార్ట్ చేసారు.  ఈ సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని వీరు రిలీజ్ చేసారు.

ఈ  పోస్టర్ లో  ముగ్గురు బాలలు  కృష్ణుడు, రాముడు, హనుమంతుడు గెటప్స్ లో  కనిపిస్తున్నారు. వెనకాల వాంటెడ్ అనే బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఉంది. ఈ చిత్రంలో ఈ ముగ్గురి క్యారెక్టర్స్ తో పాటు ఇద్దరు లీడ్ యాక్టర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

అతి  త్వరలోనే వారి క్యారెక్టర్స్ ని కూడా రివీల్ చేయనున్నారు. ఈ సినిమా కి  మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ  డిసెంబర్ 14 నుండి  రెగ్యులర్ షూట్ జరగనుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button