Tollywood news in telugu

ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిసెస్’ఫస్ట్ లుక్ పోస్టర్ !!!

ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిసెస్’ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే
కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా
ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్
సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో
తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత
మధుర శ్రీధర్ విడుదల చేశారు. పోస్టర్ ఇన్నోవేటివ్ గా ఉందని మెచ్చుకుంటూ
ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మధుర శ్రీధర్.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ:

“ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి
పెళ్లవుతుంది.
వీరి లో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన
మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే
కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది” అన్నారు.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో ఉన్న
ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు.
పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్
కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి,కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్
డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ :
జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button