Today Telugu News Updates
ఫోన్ దొంగల కొత్త ఎత్తులు … జాలిపడి ఇచ్చారా… తూర్పు తిరిగి దండం పెట్టుకోల్సిందే !

హైదరాబాద్ లో కొత్తరకం ఫోన్ దొంగతనాలకు తెరలేపారు, ఫోన్ దొంగలు. అదెలాగంటే ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పై వచ్చి సర్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది కాస్త మీ ఫోన్ ఇస్తారా అని రేక్వేస్ట్ గా అడిగి మీ దగ్గరినుండి ఫోన్ తీసుకుంటారు.
మీరుగాని జాలి పడి ఇచ్చారా ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోల్సిందే , ఎందుకంటే మీ ఫోన్ ని తీసుకొని వెంటనే బైక్ ఎక్కి పరార్ అవుతారు.
ఇలాంటి సంఘటన షాపూర్ నగర్ లో చోటుచేసుకుంది. యూసుఫ్ పాషా అనే కుర్రాడు ఆటో కోసం వేచిచూస్తూ బస్టాప్ లో నిల్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి చిటికెలో ఫోన్ తీసుకొని వెళ్లిపోయారు.
యూసుఫ్ పాషా వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కంప్లెన్ట్ ఇవ్వగా , పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.