Gossips

Mohan Babu entry towards OTT : ఓటీటీలో అడుగుపెట్టబోతున్న కలెక్షన్ కింగ్ ?:-

Mohan Babu entry towards OTT

Mohan Babu entry towards OTT : కలెక్షన్ కింగ్ అంటే ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అదేనండి మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు సినిమాలతో మరియు పర్సనల్ లైఫ్ తో ఫుల్ బిజీ గా ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మోహన్ బాబు గారు ఓటీటీ లో కనిపించబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది.

అయితే ఇదివరకే నందమూరి బాలకృష్ణ గారు ఆహ ఓటీటీ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేయబోతున్నారని , ఈ షో నవంబర్ 4 నుంచి ఆహ లో ప్రారంభం కానుంది అని అధికారికంగా ప్రకటన జరిగింది. అయితే బాలకృష్ణ గారి తరహాలోనే మోహన్ బాబు గారిని ఆహ బృందం సంప్రదించినట్లు తెలుస్తుంది.

అయితే మోహన్ బాబు గారితో టాక్ షో నా లేదా ఏదైనా ఎక్సక్లూసివ్ ఆహ స్పెషల్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు అనే వార్త మీద క్లారిటీ లేదు. కాకపోతే ఆహ బృందం మోహన్ బాబు గారిని సంప్రదించినట్లు , దానికి కలెక్షన్ కింగ్ అంగీకరించినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు ఆహ బృందమే వెల్లడించాల్సి ఉంది.

చూడాలి మరి ఆహ బృందం కలెక్షన్ కింగ్ తో టాక్ షో ప్లాన్ చేసారో లేదా ఇంకా ఏదైనా స్పెషల్ సిరీస్ ప్లాన్ చేసారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా మోహన్ బాబు గారు ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం చేశారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button