Tollywood news in telugu
నాని సినిమాకి ముహూర్తం ఖరారు !

ఈ సంవత్సరం లో నాని హీరోగా చేసిన ‘v’ సినిమా ఓ టిటి లో రిలీజ్ చేసారు. ఈ సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ కొత్త మంది రొటీన్ రివెంజ్ స్టోరీ అని కామెంట్ కూడా చేసారు.
అలాగే నాని సినిమా తీస్తున్నాడంటే మినిమమ్ హిట్ కొట్టితీరుతుంది. ఇపుడు తాజాగా నాని, శివ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్ ‘ లో రెగ్యులర్ షూటింగ్ పాల్గొంటున్నాడు.
మరో వైపు రాహుల్ దర్శకత్వం లో నాని 27వ సినిమా శ్యామ్ సింగరాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా 1970-80 లో జరిగిన కథగా ఉండనుందని సమాచారం .
నాని తన ట్వీట్ లో ‘ష్… ఎవరికీ చెప్పొద్దూ రేపు మంచిరోజు అందుకనే రేపు మాట్లాడుకుందాం’ అని పోస్ట్ చేసారు. ఏదేమైనా నాని ఈ దీపావళి నాడు అభిమానులకు తన 28వ సినిమా ముహూర్తం చెప్పనున్నాడా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.