Monal Gajjar: “అల్లుడు అదుర్స్” మూవీ సెట్ లో కంటతడి పెట్టిన మోనాల్ గజ్జర్

అల్లుడు శీను హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీనివాస్ నటించిన “అల్లుడు అదుర్స్” అనే చిత్రం ఈనెల జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అల్లుడు అదుర్స్ చిత్రంలో హీరోయిన్లుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుల్ … విలన్ గా సోనుసూద్.. హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్, కమెడియన్లుగా రచ్చ రవి, బ్రహ్మాజీ నటిస్తున్నారు.అలాగే హీరోయిన్, బిగ్బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ సాంగ్ లో చిందేసింది.
ఈ మేరకు సెట్ లో షూటింగ్ జరుగుతున్న సందర్భంగా మోనాల్ గజ్జర్ ఏడ్చేసిందని అల్లుడు అదుర్స్ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఇదే విషయాన్ని యాంకర్ సుమ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మోనాల్ ని అడగగా… “నేను డిసెంబర్ 31 న అల్లుడు అదృష్ట చిత్ర షూటింగ్లో పాల్గొన్నా.. కానీ అదే డిసెంబర్ 31న మా నాన్న చనిపోయారు. అది నాకు గుర్తు వచ్చి కన్నీళ్లు వచ్చాయని మోనాల్ చెప్పారు