Mosagallu Movie Review : మోసగాళ్ళు సినిమా రివ్యూ

నటీనటులు : కాజల్ అగర్వాల్, మంచు విష్ణు,,సునీల్ శెట్టి,నవదీప్,నవీన్ చంద్ర
డైరెక్టర్ : జెఫ్రీ గీ చిన్
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ.
ఎడిటింగ్: గౌతమ్ రాజు.
నిర్మాత: మంచు విష్ణు.
రచన: మంచు విష్ణు.
సంస్థ: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్. ;
విడుదల: 19-03-2021.
Mosagallu Movie Review : మంచు విష్ణు , కాజల్ అగర్వాల్ కలిసి నటించిన సినిమా మోసగాళ్లు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించ బడింది. అదేవిదంగా నిర్మాతగా మంచు విష్ణు వ్యవహరించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇందులో మంచు విష్ణు , కాజల్ అగర్వాల్ అక్కా తమ్ముళ్లుగా చేసారు.
కథ:
అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కవల పిల్లలు. వీరిలో అర్జున్ కంటే అను పెద్దది. వీరి తండ్రి తనికెళ్ళ భరణి. నీతి, నిజాయితీని నమ్ముకొని బ్రతికే తనికెళ్ళ భరణిని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేయడంతో వీరి కుటుంబం రోడ్డున పడుతుంది. వీరి కుటంబం రాణిగంజ్ లోని ఒక స్లమ్ ఏరియాలో ఉంటారు. పెరిగి పెద్దయిన అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం రాజధాని హైదరాబాద్ వెళ్లారు. అర్జున్ మాత్రం ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తూ బాగా డబ్బు సంపాదించాలన్న కసి మీద ఉంటాడు.
ఇలా కాల్ సెంటర్లో పనిచేసే అర్జున్ డేటా చోరీకి పాల్పడుతూ , తనతో విజయ్ (నవదీప్) కూడా చేతులు కలిపి బారి మోసానికి పాల్పడుతాడు. వీరికి కాజల్ కూడా తోడై అమెరికాలోని వారిని కూడా మోసం చేసి ఒక పెద్ద కంపెనీని స్థాపిస్తారు. ఇలా వీరు 26 వేయిల కోట్లు సంపాదిస్తారు.
ఈ స్కామ్‌ని ఛేదించే ఆఫీసర్‌గా ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగడం ఇందులో ఒక ట్విస్ట్. కుమార్ కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్జున్ మోసాన్ని పసిగట్టి మొత్తానికి అరెస్ట్ చేస్తాడు. ఇలా అరెస్ట్ ఐన తరువాత తన డబ్బు పవర్‌తో ఈ కేసు నుంచి అర్జున్ బయటపడ్డాడా.. లేదా? అను పరిస్థితి ఏంటి? నిజాయితీగా డబ్బు సంపాదించాలని భావించే అర్జున్ తండ్రికి ఈ భారీ స్కామ్ గురించి తెలుస్తుందా.. ? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ యొక్క కథ.
రివ్యూ:
ఒక యదార్థ కథను రాసుకున్న మంచు విష్ణు, డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ సహాయంతో సినిమాను బాగానే ప్రెసెంట్ చేసాడు. ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్ ఏంటంటే అక్క, తమ్ముడు కలిసి భారీ మోసానికి పాల్పడటం . ఒక మధ్య తరగతి వ్యక్తి వేల కోట్ల రూపాయల స్కామ్ ఎలా చేశాడో చూపిస్తూ కథను ఆసక్తికరంగా మలిచారు, దీనికి తోడు ఆన్‌లైన్ మోసాలను, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానం ఆకట్టుకుంది. కథను రియాలిటీకి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. ఏసీపీ ఆఫీసర్‌గా సునీల్ శెట్టి రోల్ సినిమాకు ప్లస్ అయింది. అదేవిదంగా క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి. ముక్యంగా వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో అట్రాక్షన్ అని చెప్పవచ్చు.
కామెడీ జోలికి పోకుండా కేవలం సబ్జెక్ట్‌తో సినిమాను నడిపించడం ఒక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇండియాలో భారీ స్కామ్స్ చేసిన మోసగాళ్ళు కూడా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ,ఎవరి కంట పడకుండా తిరగడం ,ఇండియన్ లా సిస్టంపై సెటైర్ వేసినట్టు అనిపిస్తుంది. నవదీప్, నవీన్ చంద్ర రోల్స్ ఇంపార్టెంట్ అయినప్పటికీ పెద్దగా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.
చివరగా..
ప్రతి మనిషి జీవితంలో డబ్బే లగ్జరీ,సుఖం, కష్టం, సమస్య అని చెప్పే కథనే ఈ సినిమా .