Mosagallu Telugu Movie Trailer: ‘మోసగాళ్లు’ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి…!

Mosagallu Movie Trailer : ఒక ఐటీ కుంభకోణం కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ ‘మోసగాళ్లు’. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ‘జెఫ్రీ జీ చిన్’ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో విష్ణు హీరో గా నటిస్తున్నారు. అదేవిదంగా తన సోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఓ వాస్తవ కథ ఆధారంగా తీస్తున్న సినిమా ‘మోసగాళ్లు’ అని వెల్లడించారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనను ఈ మూవీ లో తిలకించవచ్చని తెలిపారు. ఈ చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇక ‘మోసగాళ్లు’ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసినందుకు మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేసారు. అలాగే చిరుకి కృతజ్ఞతలు తెలిపాడు. మా అందరిపై మీ ప్రేమాభిమానాలు చూపినందుకు “థాంక్యూ అంకుల్” అంటూ తన అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేసాడు.
ఇక ట్రైలర్ లో మంచు విష్ణు డబ్బు, పేదరికం గురించి చెప్పే డైలాగుల అందరిని ఆకట్టుకునే విదంగా ఉన్నాయి. ఇక లక్ష్మీదేవి ఎందుకంత రిచ్ అయ్యిందో తెలుసా అంటూ కాజల్ చెప్పే డైలాగు వెనుకనున్న ఆంతర్యమేమిటో అని చర్చ ప్రేక్షకులలో మొదలైంది. ఈ సినిమా మొత్తం మనీ చుట్టూనే తిరుగుతుందన్న విషయం అర్థమౌతుంది.