technology information

ఇండియన్ మార్కెట్ లో కి త్వరలో రాబోతున్న Moto G6 ప్లస్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్  

మోటరోలా మోటో G6 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో ప్రవేశపెట్టబోతుందని నిర్ధారించింది. ఈ ఫోన్ జూన్ నెలలో విడుదలైన మోటో G6 యొక్క లేటెస్ట్ వెర్షన్ గా రిలీజ్ కానుంది.

Moto G6 ప్లస్ ను ఖచ్చితంగా ఎప్పుడు లాంచ్ చేయబోతుందో డేట్ ఇంకా తెలియదు, కాని ఈ సంస్థ ట్విట్టర్ లో మోటో G6 ప్లస్ లాంచ్ గురించి తెలిపారు. ఒక ట్వీట్ లో, మోటరోలా కంపెనీ “మీ స్మార్ట్ ఫోన్ నుండి మరింత ఎక్కువ అడిగే సమయం వచ్చింది. MotoG6Plus కు హలో చెప్పండి, ఇది ఒక స్మార్ట్ కెమెరా మరియు బెస్ట్ పనితీరుతో తయారయ్యింది, రెడీగా ఉండండి. అని ట్వీట్ చేసారు.

మోటో G6 మరియు Moto G6 ప్లస్ రెండు ఒకే విధమైన డిజైన్ తో, కెమెరా సెటప్స్ మరియు బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి, కాని G6 ప్లస్ ‘మెరుగైన పనితీరు కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. హ్యాండ్ సెట్లో 5.7 ఇంచ్ మాక్స్ విజన్ FHD + డిస్ ప్లే (2160 x 1080) మరియు 18: 9 యొక్క యాస్పెక్ట్ రేషియో ని కలిగి ఉంది. హుడ్ కింద స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్, 4GB లేదా 6GB RAM గాని, 64 GB లేదా 128GB స్టోరేజ్  తో ఉంటుంది. అసలు ఒరిజినల్ మోటో G6 తో పోలిస్తే మోటో G6 ఒక స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ చేత పవర్ చేయబడి ఉంటుంది.

ముందు వైపు కెమెరాలో, డివైస్ 12MP ప్రైమరీ మరియు ఒక 5MP సెకండరీ సెన్సార్ కలిగి ఉన్న ఒక డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు వైపు ఒక 8MP ఫ్రంట్-ఫేసింగ్ షూటర్ ఉంటుంది. Moto G6 ప్లస్ ఒక 3,200mAh బ్యాటరీ సపోర్ట్ తో మరియు ఇది Android 8.0 Oreo తో రన్ అవుతుంది. అదనంగా Moto G6 ప్లస్ ఒక ఫేస్ అన్లాక్ ఫీచర్ తో కలిగిన ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పొందవచ్చు.

Moto G6 ప్లస్ ఇప్పటికే మెక్సికో మరియు యూరోప్ లో అందుబాటులో ఉంది. దీని ధర అక్కడ 299 యూరోలు (లేదా సుమారు రూ .24,041) . అయితే, భారతదేశంలో, ఈ స్మార్ట్ ఫోన్ ధర బేస్-మోడల్ రూ .15,999 గా, మరియు టాప్-ఎండ్ మోడల్ ధర రూ 17,999 గా ఉండవచ్చు.  మరి మోటో G6 ప్లస్ ఏ మేరకు వినియోగదారులను ఇంప్రెస్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.

Tags

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button