Movable Houses: మోవెబుల్ హౌజ్… 8.5 లక్షలే…
Movable Houses: మోవెబుల్ హౌజ్… 8.5 లక్షలే… :- కొందరికి సొంత ఇల్లు కట్టుకోవాలి..అందులో జీవించాలి అని కోరిక ఉంటుంది.అలాంటి వారి కోసమే కొత్తగా మోవాబుల్ హౌసెస్ అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడికంటే అక్కడికి ఈ ఇల్లును తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

ఈ మోవాబుల్ హౌస్ లో 2 రూమ్స్ ఉంటాయి..మొదట బాల్కనీ ఉంటుంది. అలాగే 1 బాత్రూం కూడా ఉంటుంది.ఈ హౌస్ లో విండోస్, వెంటిలేషన్ నుఅద్భుతంగా సమకూర్చారు.ఈ హౌస్ ని ఐరన్ తో డిజైన్ చేశారు. అలాగే బాల్కనీ మోడల్ ఫ్లోర్ తో తయారు చేయగా… రెండు రూములు మార్బుల్స్ తో ఫ్లోరింగ్ చేశారు. అలాగే సీలింగ్ లైట్స్ కూడా చేశారు ముఖ్యంగా ఇందులో పవర్, వాటర్ సెట్ అప్ కూడా చేశారు. ఈ ఇల్లు ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి లారీ మీద పెట్టి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లే సదుపాయం ఉంది. ఈ మోవాబుల్ హౌస్ ధర 8.5 లక్షలు… ఇప్పుడు ఈ హౌస్ లు హైదరాబాద్, విశాఖపట్నం తదితర పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి