Today Telugu News Updates
ఆ ఐదుగురి వల్ల సినిమా థియేటర్లు తెరచుకోవట్లేదు !

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఆ ఐదుగురు సినిమా థియేటర్లు తెరుచుకోకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే కరోనా కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఎందరో నష్టపోయారని తెలిపాడు.
దాదాపు అన్ని రంగాలు పనులు కొనసాగిస్తున్నాయని, థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్తానని , చిన్న సినిమాలను, చిన్న జీవితాలను బతికించండి అని నిర్మాత వాపోయాడు.
ఇటీవల ప్రభుత్వం సినిమా షూటింగ్ లు, టీవీ షూటింగ్, థియేటర్లకు అనుమతి ఇచ్చింది . కానీ పూర్తి స్థాయిలో మాత్రం థియేటర్లు తెరచుకోకపోవడం బాధాకరం అని వెల్లడించాడు.