Mr. Premikudu (2021) Review

Movie Name :- Mr. Premikudu (2021) Review
నటీనటులు :- ప్రభుదేవా ,ప్రభు, అదా శర్మ , నిక్కి గర్లాని
నిర్మాతలు :- శ్రీనివాస రావు విసింగిరి
సంగీత దర్శకుడు :- అమ్రేష్ గణేష్
డైరెక్టర్ :- శక్తి చిదంబరం
Release Date : 29th October 2021
Story ( Spoiler Free ):-
ఈ కథ ప్రభుదేవా మరియు అతని స్నేహితులు టెన్షన్ టెన్షన్ గా కార్ ప్రయాణం చేస్తూ ఉండటం తో మొదలవుతుంది. ఆలా ప్రయాణం లోనే ప్రభుదేవా ఇంట్రడక్షన్ ఫైట్ , ఫైట్ అవ్వగానే మల్లి ఫోన్ చూస్తూ టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటారు ప్రభుదేవా. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.
ఫ్లాష్ బ్యాక్ లో ప్రభుదేవా మ్యాట్రిమోనీ నడుపుతూ సక్సెస్ఫుల్ గా 99 పెళ్ళిళ్లు చేస్తారు. ఇపుడు 100 వ పెళ్ళిగా ప్రభుదేవా దే ఉండాలని అతని తల్లితండ్రులు కోరగా సీన్ హీరోయిన్ నిక్కీ గార్లని (సారా ) ఇంట్రడక్షన్ మొదలవుతుంది. ప్రభు ( రామకృష్ణన్ ) డాక్టర్ అతని కూతురే సారా. కొన్ని కన్ఫ్యూషన్ కామెడీ సన్నివేశాలు జరగగా మొత్తానికి ప్రభుదేవా మరియు నిక్కీ లవ్ లో పడుతారు , పెళ్ళికి కూడా సిద్ధం అవుతారు.
పెళ్లి పనులు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అని అనుకునే సమయానికి ప్రభుదేవా స్నేహితుడైన వివేక్ సారా మీద లేనిపోని అనుమానాలు ఆధారలతో సహా ప్రభుదేవా కి చూపించగా ఒక్కసారిగా మందుతాగేసి ప్రభుదేవా వీడియో రికార్డు చేసి సారా కి పంపుతారు. ఇంతలో ప్రభుదేవా ని చంపడానికి సారా ( ఆదా శర్మ ) గన్ పట్టుకొని బయల్దేరుతుంది.
అసలు ప్రభుదేవా కి ఆదా శర్మ మధ్య కనెక్షన్ ఏంటి ? ఎందుకు ప్రభుదేవా ని చంపడానికి గన్ పట్టుకొని బయలుదేరింది ? అస్సలు ప్రభుదేవా నిక్కీ మధ్య విబేధాలు రావడానికి కారణం అయినా వీడియో ఏంటి ? వివేక్ ఏ వీడియో చుపియడం తో ప్రభుదేవా వీడియో రికార్డు చేయవలసి వచ్చింది ? చివరికి ప్రభుదేవా ఆదా శర్మ ని పెళ్లి చేసుకుంటాడా లేదా నిక్కీ ని పెళ్లి చేసుకుంటాడా ? ఇంత కన్ఫ్యూషన్ జరగడానికి కారణాలు ఎం ఎం ఎదురయ్యాయి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- ప్రభుదేవా , అదా శర్మ , నిక్కి గార్లని ఈ ముగ్గురి పర్ఫార్మెన్స్ తో సినిమాని టాప్ లో కూర్చోబెట్టారు. ముగ్గురు ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయి సినిమాలో కామెడీ నీ బాగా జెనరేట్ చేశారు.
- మిగితా పాత్రధారులు కూడా సినిమాకి కావాల్సిన కామెడీ జెనరేట్ చేశారు.
- సినిమా యొక నిడివి.
- దర్శకుడు కథనం బాగా హ్యాండిల్ చేశారు ఎక్కడ బోర్ కొట్టకుండా.
- ఎడిటింగ్ పర్వాలేదు.
- మ్యూజిక్ ఓకే.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives👎 :-
- అనవసరపు సన్నివేశాలు ఉన్నాయి.
- పాటలు పెద్దగా అలరించవు.
Overall :-
మొత్తానికి మిస్టర్ ప్రేమికుడు అనే సినిమా కామెడీ సినిమాల కోసం పరితపించే ప్రేక్షకులకి ఒక చక్కటి సినిమా. సినిమాలో కామెడీ బాగానే పండించారు. ప్రభుదేవా , వివేక్ , నిక్కీ గార్లని , అదాశర్మ కలిసి ప్రేక్షకులని బాగా నవ్విస్తారు. మిగితా పాత్రధారులు కూడా వారి వారి పరిధిలో బాగానే కామెడీ జెనెరేట్ చేసారు.
కథ పాతదే , కానీ కధనం బాగా రాసుకొని దర్శకుడు హిట్ కొట్టారు. సినిమాలో పాటలు పెద్దగా అలరించవు , మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. మొత్తానికి ఈ వారం స్ట్రెస్ అంత తీసేసి పక్కన పడేయాలంటే ఈ మిస్టర్ ప్రేమికుడు సినిమా కుటుంబం అంత కలిసి చుడండి తప్పకుండ అని ఆలోచనలు మరిచిపోయి నవ్వుకొని బయటికి వస్తారు.
Rating :- 2.75 /5