movie reviews

సినిమా :- 36 వయస్సులో రివ్యూ

36 వయస్సులో

Movie Watch on Aha app…

నటీనటులు :- జ్యోతిక , రెహ్మాన్, అభిరామి , నాజర్ .

మ్యూజిక్ డైరెక్టర్:- సంతోష్ నారాయణ్ 

నిర్మాతలు :- సూర్య శివ కుమార్  

డైరెక్టర్ :- రోషన్ ఆండ్రీవ్స్ 

కథ:-

సినిమా :- 36 వయస్సులో రివ్యూ(2020):: సినిమా ఓపెన్ చేస్తే ఒకరోజు ఉదయం 9 గంటలకు ఐర్ ల్యాండ్ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వెళ్తుంది వసంతి (జ్యోతిక). కానీ తన వయసు కారణంగా ఫెయిల్ అవుతుంది. వసంతి వయసు 36 సంవత్సరాలు. తన భర్త అల్ ఇండియా రేడియోలో పని చేస్తాడు. కాకపోతే వీసా తెచ్చుకొని ఐర్లాండ్ కి వెళ్లి సెటిలవ్వాలి అని అనుకుంటాడు. వసంతి కూతురికి కూడా ఐర్లాండ్లో చదవాలని గట్టి కోరిక మనసులో స్థిరపడిపోయింది. ఇదిలా ఉండగా పోలీసులు వసంతి కోసం సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వసంతి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అప్పర్ డివిజన్ క్లర్క్ గా పని చేస్తుంది. అసలు పోలీసులు వసంతి కోసం ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా వసంతి భర్త చిన్నబాబు కార్ ఆక్సిడెంట్ చేస్తాడు. వీసా ఎక్కడ రద్దు చేస్తారో అనే భయంపుట్టగా ఒక మిత్రుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారిని చూపించు అని చెప్పగా వసంతికి ఎలాగో ఐర్లాండ్లో జాబ్ రాలేదు కాబాట్టి వసంతి డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులకి చూపిస్తే, పోలీసులు ఈ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగిసి 2 సంవత్సరాలు అవుతుంది అని హెచ్చరించి కేసు వేయాల్సివస్తుంది అని చెప్తారు. ఇతర పోలీసులు మాత్రం వసంతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనేవుంటారు. 

ఇదిలా ఉండగా వసంతి మరియు తన భర్త డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో గొడవపడుతుండగా వసంతికి కమీషనర్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వసంతి భయం భయంగా కమీషనర్ ఆఫీస్ కి వెళ్లగా అక్కడ వసంతి గురించి ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు అందరు వసంతికి ఇలా ప్రెసిడెంట్ అఫ్ ఇండియా మిమల్ని కలవాలి అని అనుకుంటున్నారు దానికి కారణం మీ కూతురు అని చెప్తారు. అలాగే ప్రెసిడెంట్ ని కలిసే రోజు వివరాలు అని వెల్లడిస్తారు. రాత్రికి రాత్రి వసంతి ఫేమస్ అయిపోతుంది. అందరూ ఆమెతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. వసంతి, తన కూతురు ఏ ప్రశ్న అడగటం వల్ల ప్రెసిడెంట్ కలవాలి అని అనుకుంటున్నాడని కూతురిని  ఎంత అడిగినా కూతురు సమాధానం చెప్పదు. 

ఇంతకీ ప్రెసిడెంట్ వసంతిని ఎందుకు కలవాలని అనుకున్నాడంటే.. వసంతి కూతురు స్కూల్ లో ప్రెసిడెంట్ కి అడిగే ప్రశ్నలలో ఈ విధంగా ప్రశ అడిగింది.. ” మన దేశంలో స్త్రీ ప్రెసిడెంట్ ఎందుకు లేరు . ఒకపుడు ఉన్న స్త్రీ ప్రెసిడెంట్స్ ఈ జనరేషన్లో ఎందుకు లేరు, ” అని అడగగా దానికి ప్రెసిడెంట్ సంతోషించి.. ఈ ప్రశ నీకు ఎవరు నేర్పారు అని అడగగా , వసంతి కూతురు మా అమ్మ నేర్పింది అని చెప్తది.. ఈ కారణం చేతనే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా వసంతిని కలవాలనుకుంటాడు.

మీటింగ్ రోజు రానే వస్తుంది. ప్రెసిడెంట్ కాన్వాయ్ లో వసంతిని పిలుచుకుని వెళ్తారు. అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని గన్ మెన్స్ ని చూసి వసంతి తట్టుకోలేక స్ప్రహ కోల్పోయి ప్రెసిడెటుకి నమస్కారం చేసేలోపే కింద పడిపోతుంది. ఇన్ని రోజులు వసంతి గురించి గొప్పగా ప్రచురించిన వారే తన మీద సోషల్ మీడియా లో కామెడీ చేస్తుంటారు. ఇది వసంతి కూతురు తట్టుకోలేకపోతుంది. సడన్ గా వసంతి భర్త వచ్చి డిన్నర్ కి బయటికి వెళ్తున్నాం అని చెప్పడంతో ఉలిక్కి పడుతుంది. డిన్నర్ సమయంలో వసంతి భర్త ” నేను నా కూతురు ఐర్లాండ్ కి వెళ్తున్నాం, వీసా వచ్చేసింది ” నువ్వు కలలు కంటూ బ్రతికేసేయ్. అప్పుడప్పుడూ వచ్చి కలుస్తాను అని చెప్పేసి విమానం ఎక్కేసి వసంతి భర్త మరియు కూతురు ఐర్లాండ్ కి వెళ్లిపోతారు.

ఇంటర్వెల్ 

ఇంటర్వెల్ తర్వాత వసంతి బాధపడుతూ ఉంటుంది.   కూతురిని తలచుకొని సరైన భోజనం చేస్తుందో లేదో అని ఆలోచించడం అలా ఆవేదనకు గురవుతుండగా అనుకోకుండా ఓ రోజు వసంతి వద్దకు చిన్ననాటి స్నేహితురాలు సుశీ వచ్చి వసంతికి పాతరోజులు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో వసంతి ఎలా ఉండేది ఇపుడు వసంతి ఎలా అయిపొయింది అని వసంతిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ధైర్యాన్ని ఇస్తుంది. వసంతి ధైర్యం తెచ్చుకొని సోషల్ మీడియాలో తనని అవమానించిన వారందరికీ గుణపాఠం చెప్పేందుకు ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి ప్రశంసలు పొందుతుంది. అలా జీవితం సాగుతుంది.

వసంతిని భర్త దూరం పెట్టాలనే చూస్తుంటాడు.అలాంటి సమయంలో వసంతి ఆర్గానిక్ వెజిటబుల్స్ సరఫరా చేయాలని నిర్ణయించుకుంటుంది. ఒక వ్యాపారవేత్త 2000 మందికి సరిపడేంత ఆర్గానిక్ వెజిటబుల్స్ కావాలని కోరగా వాసంతి తన తెలివితేటల్ని ఉపయోగించి మినిస్టర్స్, సెలబ్రిటీస్ ని పిలిపించి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్గానిక్ వెజెటబుల్స్ గురించి వివరణ ఇచ్చి దేశానికి ఇవే అవసరం అన్నట్లు మార్పు తెస్తుంది. ఆలా రెండు సంవత్సరాలు అయిపోగా ప్రెసిడెంట్ అఫ్ ఇండియాని కలవడానికి వసంతి మళ్ళీ వెళ్తుంది. ఈసారి చక్కగా ప్రెసిడెంట్ తో మాట్లాడి భర్త చేత శభాష్ అనిపించుకుంటుంది. 

* ఎప్పటిలాగే జ్యోతిక తన నటనతో ప్రేక్షకులని అలరించింది.

*  దర్శకుడు కథ మరియు కథనంతో ప్రేక్షకులని కట్టిపడేస్తాడు.

* సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది.

* ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

* పాటలు కథానుసారంగా వస్తాయి. 

* ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా సాగిపోతుంది. 

* ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాల బాగున్నాయి. 

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత చక్కగా ఉంటే బాగుంటుంది.

ముగింపు :-

36 వయస్సులో సినిమా ప్రతి మహిళకి నిదర్శనం. ఇలాంటి చిత్రాలు చూసైనా కొంతమంది మారుతారు అనిపిస్తుంది. పెళ్లైనా ఆడవారు జ్యోతికలో తమని తాము చూసుకుంటారు. సినిమాలో ఎక్కడ బోర్ కోట్టే సన్నివేశం లేదు. ఈ చిత్రం ప్రతిఒక్కరూ చూడాల్సిన సందేశాత్మక చిత్రం. పాటలు కథానుసారంగా సాగగా కొత్త ఆలోచనలని నింపుతాయి.

రేటింగ్ :- 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button