సినిమా హాళ్లలో చంపడానికి రాబోతోంది: రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా టైం లో తెరకెక్కెంచిన చిత్రం ‘మర్డర్’. ఈ సినిమా త్వరలో విడుదల కానుందని ఆర్జీవీ వెల్లడించాడు.
ఈ సినిమాపై అమృత ఇదివరకే అభ్యన్తరాలు వెల్లడించారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ మూవీని నిర్మించాడని అమృత ఫ్యామిలీ తెలిపింది.
అందువల్ల మర్డర్ సినిమా విడుదల నిలిపి వేయాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండ కోర్టు ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్‌కు కోర్టు ఆదేశాలు వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను రామ్‌గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
మర్డర్ సినిమా విడుదలకు ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ను వర్మ పోస్ట్ పెట్టాడు . అదే విధంగా ‘మర్డర్’ సినిమా విడుదలచేయడానికి అడ్డంకులు ఇక లేనట్టే, సినిమా థీయేటర్లలో చంపడానికి ‘మర్డర్’ అతి త్వరలో రాబోతుంది అని వర్మ ఒక కాప్షన్ ఇచ్చాడు.