Naandhi Movie Review : నరేష్ యాక్టింగ్ వేరే లెవల్ లో ఉందని అంటున్న ప్రేక్షకులు…!

ప్రొడ్యూసర్ : సతీష్ వేగేశ్న
డైరెక్షన్ : విజయ్ కనకమేడల
బాణీలు : శ్రీచరణ్ పాకాల
నటీనటులు: నరేష్, హరీష్ ఉత్తమన్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు

‘అల్లరి’ నరేష్ హీరోగా ‘క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘నాంది’ , ఈ మూవీ ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందింది. దీనిని ఒక కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల గారు పనిచేసారు. సంగీతం శ్రీచరణ్ పాకాల థియేటర్ లో ఉన్నవారిని అదిరిపడేలా చేసారు. ఈ సినిమా ఈ రోజు ఫిబ్రవరి 19న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే టీజర్ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలను పెరిగాయి.
ఇక ఈ మూవీ గురించి ఆడియన్స్ ఏమంటున్నారంటే… .

ఈ మూవీలో నరేష్ యాక్టింగ్ ఇంతకముందు ఏ సినిమాలో చూడలేదని, తన యాక్టింగ్ వేరే లెవల్ లో ఉందని అంటున్నారు. అల్లరి నరేష్ నటన ద్వారా సినిమాకు హైప్ పెరిగిందని, ఫస్ట్ ఆఫ్ తో పోల్చుకుంటే సెకండ్ ఆఫ్ మరింత థ్రిల్లింగ్ గా అనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదేవిందంగా ఈ సినిమా గురించి షోషల్ మీడియాలో నరేష్ యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఉన్న ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన నటనతో మెప్పించారని కామెంట్స్ చేస్తున్నారు.

వీరితో పాటుగా వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, ప్రియదర్శి, దేవీప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ వారివారి పాత్రలకు న్యాయం చేసారు. ఇక చేయని నేరం వల్ల శిక్ష అనుభవిస్తున్న అల్లరి నరేష్.. ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉడటంతో చూసే వారికీ క్షణం క్షణం ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా అల్లరి నరేష్ మరోసారి తన అద్భుత నటనను ప్రదర్శించాడు.