సంతోషం లో నాగార్జున కొడుకు ఇపుడు ఎం చేస్తున్నాడో తెలుసా ?

Santhoshannagarjuna son ఎంతోమంది సినిమా ప్రపంచం లోకి వచ్చి వారి సత్తాను చాటుతూ వుంటారు. మరికొందరు ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయావాళ్లు ఉంటారు. ఈ ఇండస్ట్రీలోకి వచ్చి వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమైన వ్యవహారమే మనందరికీ తెలిసిన విషయమే.
ఇక విషయానికి వస్తే అక్షయ్ బచ్చు ఈ పేరు అంతగా ఎవరికీ తెలియక పోయిన, తన మొహం చూస్తే తను నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మూవీస్, సీరియల్స్ మరియు అడ్వర్టైజ్మెంట్స్ లలో నటించిన తన చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

ఇతను బాలీవుడ్ లో హిందీ పోకిరి లో ఆయెషా టాకియా కి తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
టాలీవుడ్ లో వర్షం సీమలో ప్రభాస్ కి మేనల్లుడిగా నటించాడు. అలాగే సంతోషం సినిమాలో నాగార్జునకు కొడుకుగా నటించి టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇపుడు అక్షయ్ నటనలోనే కాదు తనకి సంగీతంలో కూడా ప్రావిణ్యం ఉంది. తాను పాడే పాటలను వీడియో రూపంలో చిత్రీకరించి, తన షోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన అభిమానులకు సంతోషాన్ని పంచుతూ ఉంటాడు.
ముంబైకి చెందిన అక్షయ్ రానున్న రోజుల్లో హీరోగా మారబోతున్నాడు వేచిచూడాలి.