మత్తులో మునిగి నగ్నంగా చిందేసిన యువతి !

హైదరాబాద్ లోని అందరు నిద్రిస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ ఏరియాలో బుధవారం అర్ధరాత్రి ఓ యువతి మత్తులో మునిగి తెగ హంగామా చేసింది. ఆ యువతీ రహ్మత్ నగర్ సమీపంలోని ఒక పార్కు వద్ద బట్టలు లేకుండా నగ్నంగా చిందులేస్తూ అక్కడ ఉన్నవారిని భయబ్రాంతులకు గురిచేసింది.
ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు దుస్తులు తొడిగారు. మల్లి కాసేపయ్యాక పోలీసులు వేసిన బట్టలను తీసేసి నగ్నగా మారడంతో , మహిళా పోలీసులు తనకి నచ్చజెప్పి మరోసారి ఆమెకు దుస్తులు వేశారు.
తనని కూకట్‌పల్లికి చెందిన భరత్ అనే యువకుడు మోసం చేశాడని యువతి మోసపోయిన తీరును వెల్లడించింది. యువతీ మద్యం తీసుకుంటూ తన ప్రియునికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానంటూ తన బట్టలని చించేసుకుంటూ రోడ్డుపై హంగామా చేసిందని పోలీసులు వెల్లడించారు.
అటుపిమ్మట యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం కల్పించి తరవాత కుటుంబసభ్యులకు అప్పగించి, ఆ యువతిని మోసం చేసిన భరత్ పై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.